పాజిటివ్ టాక్‌తో థియేటర్లలో గ్రాండ్ రిలీజ్
Ghaati movie review : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ “ఘాటీ” ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కింది. ఇందులో అనుష్క గిరిజన మహిళగా కనిపిస్తుంది. ఇప్పటివరకు వచ్చిన అప్‌డేట్స్‌కి మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. వాయిదాలు ఎదుర్కొన్న తర్వాత చివరకు ఇవాళ (సెప్టెంబర్ 5, 2025) గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలైంది.
ఫస్ట్ హాఫ్‌లో కొంత లాగ్ ఉన్నా, ఇంటర్వెల్ వరకు పిచ్చిగా ఉంది. వెడ్డింగ్ సాంగ్ బాగా ఆకట్టుకుంది” అంటూ మరొకరు రాశారు.
సెకండ్ హాఫ్‌లో క్రేజీ ఫైట్స్ ఉన్నాయి. స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. క్లైమాక్స్ మాత్రం లాగ్ అనిపించింది. మొత్తానికి చూడదగ్గ సినిమా” అని మరో రివ్యూ.
“ట్రైలర్ చూడకుండానే వచ్చాను. ఫస్ట్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్ కోసం వెయిటింగ్. స్వీటీ ధైర్యం నిజంగా మెప్పించింది” అంటూ ట్వీట్ చేశారు.
సెకండ్ హాఫ్‌లో అనుష్కశెట్టి ఆవేశం, యాక్షన్ సీన్స్ అదిరిపోయాయి. కానీ సంగీతం, బీజీఎం మాత్రం మైనస్” అని ఓ నెటిజన్ రాశారు
ఘాటీ సినిమా ఫస్ట్ హాఫ్ యావరేజ్‌గా ఉన్నా, సెకండ్ హాఫ్ సూపర్. మొత్తానికి హిట్ మూవీ. అనుష్క చేసిన శీలావతి పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుంది” అని మరొకరు పేర్కొన్నారు.
ఈ మూవీ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందింది. ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా ప్రీమియర్ షోలు విడుదలయ్యాయి. అయితే చాలా మంది ప్రేక్షకుల అభిప్రాయం ప్రకారం బీజీఎం సినిమాకి మైనస్. మొత్తానికి “ఘాటీ” సినిమాకి పాజిటివ్ టాక్ ఉంది. మాస్ లుక్‌లో అనుష్కను చూడాలనుకునే వాళ్లు తప్పక థియేటర్‌లో చూడొచ్చు.
Read also :