Revanth Reddy: మరోసారి నేనే ముఖ్యమంత్రి : రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి సీఎం పీఠాన్ని అధిరోహించబోతాననే ధీమా వ్యక్తం చేశారు. శాసనమండలి వాయిదా అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రజలు తమ పాలనను విశ్వసించి కాంగ్రెస్‌కు మరో అవకాశం ఇస్తారని స్పష్టం చేశారు.

ప్రజలు మాపై నమ్మకం ఉంచారు
మొదటిసారి ప్రజలు బీఆర్ఎస్‌ను ఓడించేందుకు ఓటు వేశారు. రెండోసారి మాత్రం మాపై నమ్మకంతో ఓటేస్తారు. అంటూ రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టేందుకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో కృషి చేస్తుందని తెలిపారు.
ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసి వారి ముందుకు వెళతాం.
సంక్షేమ పథకాల లబ్ధిదారులే మా బలమైన ఓటర్లు.
పని, అభివృద్ధి, సంక్షేమమే మా లక్ష్యం.
ప్రతీ హామీని నిలబెడతాం
హామీల అమలుపై ముఖ్యమంత్రి పునరుద్ఘాటిస్తూ, కోటి మంది మహిళలకు ప్రయోజనం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.వారు ఇప్పుడు మాట్లాడకపోయినా, ఎన్నికలప్పుడు ఓటు మాత్రం కాంగ్రెస్‌కే వేస్తారు అని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
విశ్రాంత ఉద్యోగుల బకాయిలు త్వరలోనే చెల్లిస్తాం.
ప్రభుత్వ ఆదాయాన్ని పెంచి పేదలకు మరింత మేలు చేస్తాం.తెలంగాణ అభివృద్ధే మా లక్ష్యం అని మరోసారి స్పష్టం చేసిన రేవంత్, ప్రభుత్వ విధానాలు రాబోయే రోజుల్లో మరింత ప్రగతిశీలంగా ఉంటాయని చెప్పారు.