Revanth injustice to BCs.. R. Krishnaiah

బీసీలకు రేవంత్ అన్యాయం: ఆర్.కృష్ణయ్య

హైదరాబాద్‌: బుధవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో బీసీ నేత ఆర్.కృష్ణయ్య మీడియాతో మాట్లాడారు. కులగణన లెక్కలపై ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేసిన సీఎం రేవంత్‌ రెడ్డి.. దానిని ఎందుకు చట్టం చేయలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలోని బీసీలకు కేసీఆర్ కంటే ముఖ్యమంత్రి రేవంత్ ఎక్కువ అన్యాయం చేస్తున్నారని ఆర్.కృష్ణయ్య విమర్శించారు. బీసీలకు చట్టప్రకారం 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జరిగిన కులగణనలో చాలా బీసీ కుటుంబాలు పాల్గొనలేదు. లేదంటే బీసీల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండేది. కులగణనపై చట్టం చేస్తే మేం సుప్రీంకోర్టులో పోరాడుతాం. రాజకీయాలు చేయడం మాకూ వచ్చు అని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

Advertisements
image

కాగా, లోకల్ బాడీ ఎన్నిక ల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్‌ చట్టబద్ధతతో పనిలేకుండా లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున బీసీలకు 42శాతం సీట్లు కేటాయిస్తామని కుండబద్దలు కొట్టారు. బీఆర్ఎస్, బీజేపీలు సైతం 42 శాతం బీసీలకు టికెట్లు కేటాయిస్తారా? అని సీఎం రేవంత్ సవాల్ చేశారు. దీంతో ఇప్పుడు సీఎం సవాల్‌ను బీఆర్ఎస్, బీజేపీ స్వీకరిస్తుందా? బీసీలకు 42 శాతం సీట్లు ఇస్తుందా? అన్న చర్చ నడుస్తున్నది. తాజాగా ఈ అంశంపై ఆర్.కృష్ణయ్య స్పందించడం హాట్ టాపిక్‌గా మారింది.

Related Posts
నేడు ఫ్రాన్స్ పర్యటనకు మోదీ
నేడు ఫ్రాన్స్ పర్యటనకు మోదీ

నేడు ఫ్రాన్స్ పర్యటనకు మోదీ.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం ఫ్రాన్స్‌కు రెండు రోజుల అధికారిక పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటనలో, ఆయన ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో Read more

మహదేవ్‌ శాస్త్రిగా మోహన్‌ బాబు
mohan babu kannappa

కన్నప్ప 2024లో రూపొందుతున్న తెలుగు సినిమా. ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌లపై డాక్టర్‌ మోహన్‌బాబు నిర్మిస్తున్న ఈ సినిమాకు ముఖేశ్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వం Read more

మేం అన్యోన్యంగా వున్నాము : మంచు లక్ష్మి
మేం అన్యోన్యంగా వున్నాము : మంచు లక్ష్మి

భర్తతో విడిపోయిందనే వార్తలపై మంచు లక్ష్మి స్పందనసినీ నటుడు మోహన్ బాబు కూతురు, టీవీ హోస్ట్, నిర్మాతగా పేరు తెచ్చుకున్న మంచు లక్ష్మి గత కొన్ని రోజులుగా Read more

2028 లో ప్రారంభం కానున్న శుక్రయాన్ మిషన్..
isro shukrayaan

భారతదేశం 2028 లో ప్రారంభం కానున్న "శుక్రయాన్" అనే వెనస్ ఆర్బిటర్ మిషన్‌తో ఒక ముఖ్యమైన స్పేస్ మైల్‌స్టోన్‌ను సాధించడానికి సిద్ధమవుతోంది.ఇస్రో (ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్) Read more

×