తెలంగాణలో బీరుప్రియులకు రేవంత్ సర్కార్ షాక్ ఇచ్చింది. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ తాజా నిర్ణయంతో బీర్ల ధరలు 15 శాతం మేర పెరగనున్నాయి. ఈ పెరిగిన ధరలు రేపటి నుంచి అమల్లోకి రానున్నట్లు అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా బీర్ల విక్రయాలు అధికంగా ఉంటున్న నేపథ్యంలో ధరలు పెంచడం మందుబాబులకు పెద్ద దెబ్బగా మారనుంది. ప్రభుత్వానికి ఆదాయం పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే మద్యం ధరలు పెరిగిన నేపథ్యంలో, బీర్ కూడా మంగళవారం నుంచి కొత్త ధరలతో అందుబాటులోకి రానుంది.

మద్యం విక్రయం ద్వారా ఆదాయాన్ని పెంచాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే బీర్ల ధరలను పెంచుతూ ఎక్సైజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో మద్యం వినియోగం అధికంగా ఉండటంతో, ప్రభుత్వం ధరలను పెంచడం సులభమైన ఆదాయ వనరుగా మారింది. ఇకపోతే, మద్యం ధరల పెంపుతో సామాన్య వినియోగదారులపై పెనుభారం పడనుంది. ఇప్పటికే సాధారణ బ్రాండ్ల మద్యం ధరలు పెరిగినప్పటికీ, బీర్ ధరలు పెరగడం మందుబాబులకు మళ్లీ గట్టి దెబ్బగా మారింది. ప్రజల నుంచి ఈ నిర్ణయంపై మిశ్రమ స్పందన లభిస్తోంది.బీరుప్రియులకు రేవంత్ సర్కార్ షాక్.
ఏపీ ప్రభుత్వం ఇప్పటికే రూ.99 మద్యం నిబంధనను అమలు చేయగా, మిగతా మద్యం ధరలను పెంచింది. ఇప్పుడు తెలంగాణలోనూ బీర్ ధరలు పెరగడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.