Posani : పోసానికి ఊరట బెయిల్ మంజూరు

వైసీపీ నేత, సినీ నటుడు పోసాని కృష్ణ మురళికి ఊరట లభించింది. పోసానికి గుంటూరు సీఐడీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. చంద్రబాబు, పవన్, లోకేష్‌పై అనుచిత వ్యాఖ్యల కేసులో పోసాని అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం గుంటూరు జిల్లా జైల్లో జ్యూడిషియల్ రిమాండ్‌లో ఉన్నారు. ఈనెల 23 వరకు రిమాండ్ విధించారు. అలాగే ఈ కేసులో పోసానిని సీఐడీ అధికారులు ఒకరోజు పాటు కస్టడీలోకి తీసుకుని విచారించారు. కస్టడీ విచారణ అనంతరం కూడా మరోసారి కస్టడీకి తీసుకునేందుకు సీఐడీ అధికారులు ప్రయత్నించారు. అయితే ఈలోపే పోసానికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
రేపు పోసాని విడుదలయ్యే అవకాశం
ఇప్పుడు తాజాగా గుంటూరు సీఐడీ కోర్టు పోసానికి బెయిల్ మంజూరు చేసింది. అయితే రాష్ట్రంలో పోసానిపై ఇంకా అనేక చోట్ల కేసులు నమోదు అయిన నేపథ్యంలో ఏ జిల్లా నుంచి అయినా పోలీసులు వచ్చి పీటీ వారెంట్‌‌తో పోసానిని మరోసారి అదుపులోకి తీసుకుంటారా లేక బెయిల్‌పై విడుదల అవుతారా అనేది దానిపై ఉత్కంఠ నెలకొంది. రేపు ఉదయం పోసాని విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
గతంలో పోసానిపై రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు వైసీపీ నేత మూడు సార్లు అరెస్ట్ అయి రిమాండ్ విధించగా.. మూడు సార్లు కూడా ఆయనకు బెయిల్ లభించింది.

Related Posts
ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలు… రంగంలోకి కేరళ డాగ్ స్క్వాడ్
ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలు... రంగంలోకి కేరళ డాగ్ స్క్వాడ్

ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలు… రంగంలోకి కేరళ డాగ్ స్క్వాడ్ నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట సమీపంలో ఎస్ఎల్బీసీ టన్నెల్ 14వ కిలోమీటరు వద్ద జరిగిన Read more

22 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న హీరోయిన్..
22 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న హీరోయిన్..

ఇటీవల టాలీవుడ్‌లో ఓ పాత హీరోయిన్ రీఎంట్రీకి సిద్ధమవుతోంది. దాదాపు 22 ఏళ్ల క్రితం సినీ ఇండస్ట్రీలో తన తొలి సినిమాతోనే అందరిని ఆకట్టుకున్న అన్షు అంబానీ Read more

ఫ్యాన్స్ ను మెప్పించలేకపోయినా…నిర్మాతను మెప్పించిన మాస్ మహారాజ్
ravi teja

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన మిస్టర్ బచ్చన్ సినిమా బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ రైడ్ కు రీమేక్‌గా తెరకెక్కింది అయితే Read more

ఏపీలో మరో క్యాన్సర్ హాస్పిటల్: బాల‌కృష్ణ
ఏపీలో మరో క్యాన్సర్ హాస్పిటల్: బాల‌కృష్ణ

తెలుగుభాషలో ప్రముఖ నాయకుడు, నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిని మరింత విస్తరించబోతున్నట్లు ప్రకటించారు. దీనితో పాటు, ఆసుపత్రి యొక్క పలు కీలక Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *