Relief for Mohan Babu in the Supreme Court

సుప్రీంకోర్టులో మోహన్‌బాబుకు ఊరట

ముందస్తు బెయిల్ ఇచ్చిన సుప్రీంకోర్టు

హైదరాబాద్‌: సినీ నటుడు మోహన్‌బాబుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. జర్నలిస్టుపై దాడి కేసులో ఆయనకు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. జల్‌పల్లిలోని మోహ‌న్ బాబు నివాసం వద్ద మీడియా ప్రతినిధిపై దాడి చేయడంపై పహాడీషరీఫ్‌ పోలీసులు మోహన్‌ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో మొదట ఆయనపై బీఎన్‌ఎస్‌ 118(1) సెక్షన్‌ కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. లీగల్‌ ఒపీనియన్‌ తీసుకున్న తర్వాత 109 సెక్షన్‌ కింద కేసు రిజిస్టర్‌ చేసి.. హత్యాయత్నం కేసుగా మార్చారు.

image

ఈ దాడి ఘటనలో గాయపడ్డ జర్నలిస్ట్‌కు మోహన్‌ బాబు క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు ఓ లేఖ కూడా విడుదల చేశారు. ఈ ఘటనలో ఓ జర్నలిస్ట్‌ సోదరుడు గాయపడటం నాకు బాధ కలిగించింది. ఈ ఘటన తర్వాత అనారోగ్యం కారణంగా 48 గంటల పాటు ఆసుపత్రిలో చేరడంతో వెంటనే స్పందించలేకపోయా. ఆ రోజు నా ఇంటిగేటు విగిరిపోయింది.. దాదాపు 30 నుంచి 50 మంది వ్యక్తులు ఇంట్లోకి చొచ్చుకొచ్చారని.. ఆ సమయంలో సహనాన్ని కోల్పోయినట్లు లేఖలో వివరించారు.

పరిస్థితి అదుపు చేసే క్రమంలో జర్నలిస్ట్‌కు గాయమైందని.. ఇది చాలా దురదృష్టకరమన్నారు. అతడికి, ఆయన కుటుంబానికి కలిగిన బాధకు తాను తీవ్రంగా చింతిస్తున్నట్లు చెప్పారు. గాయపడ్డ జర్నలిస్ట్‌ త్వరగా కోలుకోవాలని మోహన్‌బాబు కాంక్షించారు. ఇకపోతే..సంక్రాంతి సందర్భంగా తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్శిటీ వద్ద కూడా హై డ్రామా నడిచింది. ఇరు పక్షాల బౌన్సర్లు కొట్టుకున్నారు. చివరకు పోలీసుల అనుమతితో క్యాంపస్ లోపల ఉన్న తన తాత, నానమ్మల సమాధులను మనోజ్ దర్శించుకుని బయటకు వచ్చారు.

Related Posts
రాహుల్ గాంధీపై మాట్లాడే హక్కు బీజేపీకి లేదని మంత్రి శ్రీధర్ బాబు
Rahul Gandhi Warangal visit cancelled

కులం, మతం చూడకుండా ప్రజలను ఐక్యంగా చూడటమే కాంగ్రెస్ విధానం తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు బీజేపీ నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. "రాహుల్ గాంధీ Read more

ఏపీలో ఈరోజు నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల హామీ పథకం అమలు
Free gas cylinder guarantee scheme to be implemented in AP from today

అమరావతి: ఏపీలో గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని నవంబర్ 1వ తేదీ శుక్రవారం నుంచి అమలులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు Read more

‘వేట్టయాన్‌’ రిలీజ్ సందర్బంగా ఆఫీస్ లకు సెలవు
rajinikanth vettaiyan

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన వయసును సైతం లెక్క చేయకుండా వరుస సినిమాలు చేస్తూ యంగ్ హీరోలకు Read more

నేడు శీతాకాల విడిదికి రాష్ట్రపతి రాక
Today the President will come to Hyderabad for winter vacation

హైదరాబాద్‌: శీతాకాల విడిది కోసం నేడు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి రానున్నారు. ఈ నెల 21వ తేదీ వరకూ రాష్ట్రపతి ముర్ము Read more