Relief for Donald Trump.Dismissal of 2020 election case

డొనాల్డ్‌ ట్రంప్‌నకు ఊరట..2020 నాటి ఎన్నికల కేసు కొట్టివేత

న్యూయార్క్‌: డొనాల్డ్‌ ట్రంప్‌నకు ఊరట లభించింది. ఆయనపై ఉన్న రెండు క్రిమినల్‌ కేసులను కోర్టు కొట్టివేసింది. రహస్యపత్రాలను తన దగ్గరే ఉంచుకున్న కేసుతోపాటు 2020ఎన్నికల్లో ఓటమిని తిప్పికొట్టే ప్రయత్నాలకు సంబంధించిన కేసులను న్యాయస్థానం కొట్టివేసింది. అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ పై ఉన్న 2020 నాటి ఎన్నికల కేసును కొట్టివేయాలని ఆయన తరపు న్యాయవాది జాక్ స్మిత్ కోర్టును అభ్యర్థించారు. ఈ అభ్యర్థనను న్యాయమూర్తి తాన్యా చుట్కాన్ అంగీకరించారు. కేసును తొలగించడం సముచితమని ఈ తీర్పు అధ్యక్షుడి పదవిలో ఉన్నంత వరకు మాత్రమే. బాధ్యతల నుంచి వైదొలిగిన వెంటనే తీర్పు గడువు ముగుస్తుందని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు.

Advertisements

కాగా, 2020 ఎన్నికల నాటి కేసు కొట్టివేయడంపై ట్రంప్ కూడా స్పందించారు. ఈ కేసులు చట్టవిరుద్ధమైనవి అన్నారు. మాపై పోరాడేందుకు మా ప్రత్యర్థులైన డమోక్రట్లు పన్ను చెల్లింపుదారులకు చెందిన 100 మిలియన్ డాలర్లు వేస్ట్ చేశారు. ఇంతకు ముందు కూడా మనదేశంలో ఇలాంటివి జరగలేదని ట్రూత్ సోషల్ మీడియా వేదికగా ఆయన రాసుకొచ్చారు. 2020లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిగా బరిలోకి దిగిన ట్రంప్ ఓడిపోయిన విషయం తెలిసిందే. తర్వాత ఆయన బాధ్యతల నుంచి వైదొలుగుతున్నప్పుడు వైట్ హౌస్ నుంచి పలు కీలక దస్త్రాలను తరలించారని ఆరోపిస్తూ పలు కేసులు నమోదు అయ్యాయి.

అయితే ఈ కేసులు ఎప్పుడూ విచారణకు రాకపోవడం కూడా గమనార్హం. అమెరికాలో న్యాయశాఖ నిబంధనల ప్రకారం సిట్టింగ్ అధ్యక్షుడు క్రిమినల్ విచారణకు ఎదుర్కొకుండా వారికి రక్షణ కల్పిస్తుంది. ప్రస్తుత ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించడంతో మరికొన్ని రోజుల్లో ఆయన బాధ్యతలు కూడా చేపట్టనున్నారు. దీంతో గతంలో ఆయనపై నమోదు అయిన పలు కేసుల్లో భారీ ఊరట లభిస్తుంది. ఇటీవల హష్ మనీ కేసులో ట్రంప్ నకు శిక్ష ఖరారు అయినప్పటికీ…ఆ శిక్షణు నిరవధికంగా వాయిదా వేస్తూ న్యూయార్క్ జడ్జీ తీర్పునిచ్చిన విషయం తెలిసిందే.

Related Posts
ఢిల్లీలో 421 మార్క్‌ను దాటిన ఏక్యూఐ
Delhi's AQI crosses the 421 mark

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీవాయు కాలుష్య తీవ్రత మరోసారి ఆందోళనకర స్థాయికి చేరుకుంది. మంగళవారం ఉదయం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 400 మార్క్‌ను దాటేసింది. దీనితో Read more

Mark Carney: ట్రంప్‌ అధిక సుంకాన్ని విధించ‌డంపై ప్ర‌ధాని మార్క్ కార్నీ ఘాటు స్పంద‌న‌
ట్రంప్‌ అధిక సుంకాన్ని విధించ‌డంపై ప్ర‌ధాని మార్క్ కార్నీ ఘాటు స్పంద‌న‌

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌… కెన‌డా ఆటో రంగంపై అధిక సుంకాన్ని విధించ‌డం ప‌ట్ల ఆ దేశ ప్ర‌ధాని మార్క్ కార్నీ ఘాటుగా స్పందించారు. అమెరికాతో పాత Read more

Rajiv Yuva Vikasam Scheme 2025 : ‘రాజీవ్ యువ వికాసం’ పథకానికి భారీగా దరఖాస్తులు
RVS

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'రాజీవ్ యువ వికాసం' పథకానికి నిరుద్యోగ యువత నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ వర్గాలకు చెందిన Read more

ఆంతర్జాతీయ విద్యార్థి దినోత్సవం!
international students day

ప్రతి సంవత్సరం నవంబర్ 17న ఆంతర్జాతీయ విద్యార్థి దినోత్సవం జరుపుకుంటాం. ఈ రోజు 1939లో ప్రాగ్ నగరంలో జరిగిన సంఘటనలను గుర్తుచేసే రోజు. ఆ సమయంలో, నాజీ Read more

×