Relief for Bansuri Swaraj in defamation case

పరువు నష్టం కేసులో బాన్సురీ స్వరాజ్‌కు ఊరట

పరువు నష్టం కేసును కొట్టేసిన ఢిల్లీ కోర్టు

న్యూఢిల్లీ: ఢిల్లీ బీజేపీ ఎంపీ బాన్సురీ స్వరాజ్‌కి క్రిమినల్‌ పరువు నష్టం కేసులో ఊరట లభించింది. ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సత్యేందర్ జైన్ ఆమెపై దాఖలు చేసిన పరువు నష్టం పిటిషన్‌ను ఢిల్లీ కోర్టు గురువారం కొట్టివేసింది. ఈ అంశాన్ని విచారణలోకి తీసుకోవడానికి నిరాకరించిన అదనపు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ నేహా మిత్తల్, పిటిషన్‌ను తిరస్కరించారు. 2003 అక్టోబర్ 5న జరిగిన ఓ టీవీ ఇంటర్వ్యూలో బాన్సురీ స్వరాజ్ తన పరువుకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారని,ఆ ఇంటర్వ్యూను లక్షలాది మంది వీక్షించారని సత్యేందర్ జైన్ ఫిర్యాదులో పేర్కొన్నారు.

Advertisements
పరువు నష్టం కేసులో బాన్సురీ

సరైన ఆధారాలు లేవు..

తన నివాసం నుంచి రూ.3 కోట్లు నగదు, 1.8 కిలోల బంగారం, 133 బంగారు నాణేలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు బాన్సురీ స్వరాజ్ తప్పుడు ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. తన ప్రతిష్టను దెబ్బతీసేలా, రాజకీయ ప్రయోజనం కోసం అవినీతిపరుడు, మోసగాడు అంటూ ఆమె తప్పుదోవ పట్టించే ఆరోపణలు చేశారని జైన్‌ పిటిషన్‌లో పేర్కొన్నారు. తాజాగా ఈ కేసును విచారించిన ఢిల్లీ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్.. సరైన ఆధారాలులేవన్న కారణంగా పరువు నష్టం పిటిషన్‌ను కొట్టివేశారు.

Related Posts
సంక్రాంతికి రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’..?
game changer jpg

మెగా అభిమానులను మరోసారి నిరాశ పరచబోతుంది గేమ్ ఛేంజర్ టీం. ఇప్పటికే ప్రమోషన్ విషయంలో నిరాశ పరుస్తూ వస్తుండగా…ఇక ఇప్పుడు రిలీజ్ విషయంలో కూడా పెద్ద షాక్ Read more

Waqf Bill: వక్ఫ్ కౌన్సిల్‌లో ముస్లిమేతరుల నియామకం వద్దు: సుప్రీంకోర్టు
వక్ఫ్ కౌన్సిల్‌లో ముస్లిమేతరుల నియామకం వద్దు:సుప్రీంకోర్టు

వక్ఫ్ సవరణ చట్టం చెల్లుబాటుపై సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణలో, ఉన్నత న్యాయస్థానం ముస్లిమేతరులను వక్ఫ్ కౌన్సిల్‌లో నియమించొద్దని ఆదేశించింది. ఈ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ Read more

తెలంగాణకు కేంద్రం అన్యాయం చేస్తోంది : ఎమ్మెల్సీ కోదండరాం
Center is doing injustice to Telangana MLC Kodandaram

మీరు మౌనం వహించడం వల్లే.. ఈరోజు ఈ పరిస్థితి హైదరాబాద్‌: కృష్ణా జలాలపై తెలంగాణ , ఏపీ మధ్య జరుగుతున్న చర్చలు.. దానిపై కేంద్రం స్పందనపై ఎమ్మెల్సీ Read more

విమానం ల్యాండింగ్ గేర్ లో రెండు మృతదేహాలు
flightlanding

ఫ్లోరిడాలోని విమానాశ్రయంలో వెలుగు చూసిన దారుణం విమాన ల్యాండింగ్ గేర్ వద్ద తనిఖీల్లో వెలుగు చూసిన మృతదేహాలు ధ్రువీకరించిన జెట్‌బ్లూ విమాన సంస్థ అమెరికాలో ఓ దారుణ Read more

Advertisements
×