Release of Indiramma Atmiya Bharosa funds

ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులు విడుదల

మొత్తం 18,180 మందికి 6 వేల చొప్పున జమ

హైదరాబాద్: ఉపాధి కూలీలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉపాధి కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులు విడుదల చేసింది. ఎన్నికల కోడ్ అమల్లో లేని ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లో ఉపాధి కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం నిధులు జమ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం జనవరి 26న ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ప్రారంభించడం తెలిసిందే.

ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులు

ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాలకు

ప్రతి మండలంలోని ఒక పైలెట్ గ్రామంలో గ్రామ సభలు నిర్వహించి కూలీల ఖాతాల్లో ప్రభుత్వం నిధులు జమ చేసింది. మొత్తం 18,180 మందికి 6 వేల చొప్పున జమ చేసింది. ఆ తర్వాత శాసన మండలి ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధుల విడుదలకు బ్రేక్ పడింది. అయితే ఎన్నికల కోడ్ అమలులో లేని జిల్లాలకు నిధులు విడుదల చేయాలని మంత్రి సీతక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. దీంతో ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులు విడుదలయ్యాయి.

ఇప్పటివరకు మొత్తం 83,420 మంది ఉపాధి కూలీలకు

ఆ రెండు జిల్లాల్లో 66,240 మంది ఉపాధి కూలీ లబ్ధిదారులకు ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులు విడుదల చేసింది. దాంతో 66,240 మంది కూలీల ఖాతాల్లో 39.74 కోట్లు జమ అయ్యాయి. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 83,420 మంది ఉపాధి కూలీలకు ప్రభుత్వం 50.65 కోట్లు చెల్లించింది. ఎన్నికల కోడ్ ముగియగానే లబ్ధిదారులందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులను చెల్లించనున్న ప్రభుత్వం

Related Posts
పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలుపుపై నాగబాబు కీలక వ్యాఖ్యలు
nagababu speech janasena

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం నుండి గెలుపుపై నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన తెలిపిన ప్రకారం, పవన్ కల్యాణ్ విజయం ఏవైనా ఇతర కారణాల Read more

ఈజీ మనీ కోసం పోలీస్ అవతారం ఎత్తిన కేటుగాడు
ఈజీ మనీ కోసం పోలీస్ అవతారం ఎత్తిన కేటుగాడు

సినిమాల ప్రభావంతో పోలీస్ కావాలనే కల కనే వారు చాలామంది ఉంటారు. కానీ, కొందరు ఆ కలను సాకారం చేసుకునేందుకు కృషి చేస్తారు, మరికొందరు తప్పుమార్గాన్ని ఎంచుకుంటారు. Read more

తాజ్ బంజారా హోటల్‌కి షాక్: జీహెచ్ఎంసీ సీజ్
GHMC seizes Taj Banjara Hotel in Hyderabad

హైదరాబాద్‌లో తాజ్ బంజారా హోటల్ సీజ్ – రూ.1.43 కోట్ల పన్ను బకాయి హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్‌లో ఉన్న ప్రముఖ హోటల్ తాజ్ బంజారా గణనీయమైన పన్ను Read more

కోర్టు విచారణకు హాజరైన దక్షిణ కొరియా అధ్యక్షుడు
South Korean president attended the court hearing

రెండు కేసుల్లో వేర్వేరు కోర్టుల్లో విచారణ సియోల్ : అభిశంసనకు గురైన దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్‌ సుక్‌-యెల్‌ గురువారం కోర్టుల్లో విచారణకు హాజరయ్యారు. దేశంలో అత్యవసర Read more