Minister Lokesh : మంత్రి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లిలో నిరుపేద కుటుంబానికి శాశ్వత పట్టా అందించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రెడ్ బుక్ పేరు చెప్పగానే వైసిపి నాయకులు బెంబేలెత్తుతున్నారు, ఇప్పటికే ఒకరికి గుండెపోటు వచ్చింది. మరొకరు బాత్రూమ్ లో పడి చేయి విరిగిందని మంత్రి నారా లోకేష్ అన్నారు. చట్టాలు ఉల్లంఘించిన వారికే రెడ్ బుక్ వర్తిస్తుందని స్పష్టంచేశారు. కనిగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో 35వేలమంది ప్రజలు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు పొట్టచేతబట్టుకొని వలసలు వెళ్లారు.

ఆ మాటమేరకు కనిగిరిలో తొలి రిలయన్స్
యువగళం పాదయాత్ర సమయంలో అక్కడ వలసలను నివారిస్తానని హామీ ఇచ్చా. ఆ మాటమేరకు కనిగిరిలో తొలి రిలయన్స్ సిబిజి ప్లాంటు ఏర్పాటుచేశాం. అక్కడ ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి 50వేల ఎకరాల భూములు ఇచ్చేందుకు తమ రైతులు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. దానిపై రిలయన్స్ డైరక్టర్ స్పందించి 50 ప్లాంట్లు అక్కడే ఏర్పాటుచేస్తామని అన్నారు. కరువు ప్రాంతంలో పెద్దఎత్తున యువతకు ఉపాధి కల్పించేందుకు ఇటువంటి ప్రాజెక్టులు తెస్తుంటే వైసిపి వారికి కడుపుమంట దేనికని లోకేష్ ప్రశ్నించారు. బొబ్బలు వస్తాయంటూ దానిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
చెల్లి, తల్లికి న్యాయం చేయలేని వారు మాకు చెబుతారా?
ఆ దుష్ర్పచారానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకే అటువంటి వారిని రెడ్ బుక్ లోకి ఎక్కిస్తానని చెప్పానన్నారు. సొంత చెల్లి, తల్లికి న్యాయం చేయలేని వారు మాకు చెబుతారా? అని లోకేష్ ప్రశ్నించారు. ప్రిజనరీ ఆలోచనలన్నీ జైలువైపే ఉంటాయి. తప్పుచేశారు కనుక ఆయన ధైర్యంగా ప్రజల్లో తిరగలేకపోతున్నాడు. అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఎవరినీ కలవలేదు, ప్రతిపక్షంలోకి వెళ్ళిన తరువాత కూడా కనీసం కార్యకర్తలను కలిసే సమయం జగన్ కు లేదు. ప్రజలను కలిసే ఓపిక ఆయనకు ఎక్కుడుందని ప్రశ్నించారు.