Red Alert : జూన్‌లో వర్షాల లేమితో రైతుల నిరాశ.మే నెలల వర్షాలు పడి, జూన్ మాసమంతా వర్షాలు లేకపోవడంతో రైతులు వర్షాల కోసం ఎదురుచూశారు. కాస్త నిరాశ చెందారు కూడా. (Telangana) అయితే జులై మాసంలో 15వ తేదీ దాటిన తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రైతులు సంతోసంతో తమ పొలం పనులను చురుగ్గా చేసుకుంటున్నారు.
చెరువులు, కుంటలు నీటితో కశకళలాడుతున్నాయి
ఇప్పటికే పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండడంతో కుంటలు, చెరువులు నీటితో కశకళలాడుతున్నాయి. తాజాగా నేడు, రేపు తెలంగాణకు (Red alert) భారీ నుంచి అతిభారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న ఓ ప్రకటనలో తెలిపారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు.
ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాలు
ఈ జిల్లాల్లో అతిభారీ వర్షాలు కామారెడ్డి, జనగామ, కుమురంభీం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్, మంచిర్యాల, నల్గొండ, రంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, మంచిర్యాల జిల్లాలకు ఆరెంజ్ కలర్ హెచ్చరికలు జరీచేసినట్లు తెలిపారు.
హైదరాబాద్, రంగారెడ్డిలో అతిభారీ వర్ష సూచన
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడొచ్చని నాగరత్నం చెప్పారు