ఖనిజాల ఒప్పందంపై సంతకం చేసేందుకు సిద్ధమే : జెలెన్‌స్కీ

ఖనిజాల ఒప్పందంపై సంతకం చేసేందుకు సిద్ధమే : జెలెన్‌స్కీ

కీవ్ : ఉక్రెయిన్‌ అధినేత జెలెన్‌స్కీ ఇటీవల మీడియా ఎదుటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, వాగ్వాదానికి దిగడం యావత్ ప్రపంచాన్ని నివ్వెరపర్చింది. ట్రంప్‌ తో భేటీ వివాదంగా మారడంతో ఆ సమావేశాన్ని అర్ధంతరంగా ముగించుకొని బయటకు వచ్చేశారు జెలెన్‌స్కీ. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా ఆయన అగ్రరాజ్యంతో సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాతో డీల్‌కు తాను సిద్ధమేనన్నారు. అంతేకాదు.. అమెరికాకు ఉక్రెయిన్‌ ప్రజలు ఎల్లప్పుడూ రుణపడి ఉంటారని తెలిపారు.

Advertisements
ఖనిజాల ఒప్పందంపై సంతకం చేసేందుకు సిద్ధమే : జెలెన్‌స్కీ

సమస్యలను పరిష్కరించుకోవడానికి ఎప్పుడూ నేను సిద్ధమే

ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం ముగింపుపై చర్చించేందుకు ఆదివారం లండన్‌లో ఐరోపా దేశాధినేతల సమావేశం జరిగింది. ఇందులో జెలెన్‌స్కీ పాల్గొన్నారు. అనంతరం తాజా పరిణామాలపై ఆయన స్పందించారు. అమెరికా తో సత్సంబంధాలను కాపాడుకోగలను. నిర్మాణాత్మక సంభాషణ కోసం అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఆహ్వానిస్తే మరోసారి భేటీకి వెళ్తా. తీవ్రమైన, నిజమైన సమస్యలను పరిష్కరించుకోవడానికి ఎప్పుడూ నేను సిద్ధమే. ఖనిజాల ఒప్పందంపై ఇరువర్గాల మధ్య ఏకాభిప్రాయం కుదిరితే దానిపై సంతకం చేసేందుకు నేను సిద్ధమే అని జెలెన్‌స్కీ వెల్లడించారు.

వాస్తవమైన భద్రతా హామీలు ముఖ్యం

అనంతరం సామాజిక మాధ్యమాల్లో వీడియో సందేశం విడుదల చేశారు. ఐరోపా నుంచి మాకు పూర్తి మద్దతు ఉందనేది మరోసారి స్పష్టమైంది. శాంతి పునరుద్ధరణ అనే ప్రధాన అంశంపై అంతా ఐక్యంగా ఉన్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో మాకు వాస్తవమైన భద్రతా హామీలు ముఖ్యం. యూకే, ఐరోపా సమాఖ్య, తుర్కియే వంటి దేశాలు దీనిపై కృతనిశ్చయంతో ఉన్నాయి. ఇక్కడ అమెరికా ప్రాధాన్యతను కూడా మనం అర్థం చేసుకోవాలి. యునైటెడ్‌ స్టేట్స్‌ నుంచి మాకు అందుతున్న సాయంపై మేం ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం. వారికి కృతజ్ఞతలు తెలపని రోజు లేదు. మా స్వాతంత్ర్యాన్ని కాపాడుతున్న వారికి ధన్యవాదాలు. సుదీర్ఘ యుద్ధం కాదు.. మాకు శాంతి కావాలి. అందుకే భద్రతా హామీలు ముఖ్యమని మేం చెబుతున్నాం అని జెలెన్‌స్కీ పేర్కొన్నారు.

Related Posts
కేజ్రీవాల్‌పై దాడికి యత్నం
liquid thrown on arvind kej

ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై దాడికి ట్రై చేసారు. ఆయనపై ఒక వ్యక్తి ద్రవ పదార్థం (లిక్విడ్) విసిరిన Read more

MMTS: ఎంఎంటీస్ అత్యాచార ఘటన.. నిందితుడి గుర్తింపు
MMTs rape incident.. accused identified

MMTS : హైదరాబాద్‌ ఎంఎంటీఎస్ ట్రెయిన్‌లో అత్యాచారయత్నం కేసును పోలీసులు ఛేదించారు. అమ్మాయిపై అత్యాచారయత్నానికి పాల్పడిన వ్యక్తిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. మేడ్చల్ జిల్లా గౌడవెల్లికి చెందిన Read more

అసెంబ్లీకి వస్తా.. కాంగ్రెస్ అంతు చూస్తా- కేసీఆర్
పార్టీ కీలక నేతలతో కేసీఆర్ భేటీ

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని, త్వరలోనే రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. త్వరలో ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో Read more

Sitharamula Kalyanam : రాములోరి కళ్యాణానికి వేళాయె..
Sriramanavami april

శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని భద్రాచలం లోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో ఈ రోజు సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఈ పవిత్రమైన వేడుకను తిలకించేందుకు Read more

×