ఈ సారి ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) రాణిస్తోంది జట్టు పూర్తి జోష్‌లో ఉంది.తాజాగా జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ (RR) తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ అదరగొట్టింది.అన్ని రంగాల్లో అద్భుతంగా ఆడి 9 వికెట్ల తేడాతో గెలుపొందింది.ఈ విజయంతో ఆర్సీబీ తన ఆటతీరు మీద నమ్మకాన్ని మరింత పెంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది.కెప్టెన్ సంజూ శాంసన్, జోస్ బట్లర్ లాంటి స్టార్ ప్లేయర్లు ఆడినప్పటికీ భారీ స్కోరు మాత్రం చేయలేకపోయారు.ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ టాపార్డర్ ప్లేయర్లు మ్యాచ్‌ను చేతిలోకి తీసుకున్నారు. ఓపెనర్ ఫిల్ సాల్ట్ దూకుడుగా ఆడి 33 బంతుల్లోనే 65 పరుగులు సాధించాడు.ఇందులో 5 ఫోర్లు, 6 సిక్సులు ఉన్నాయి. అతనికి తోడుగా విరాట్ కోహ్లీ తన క్లాసీ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు.

45 బంతుల్లో 62 పరుగులు చేసి మ్యాచ్‌ను దిశగా నడిపించాడు.ఇంకొక బ్యాట్స్‌మెన్ దేవదత్ పడిక్కల్ కూడా చక్కగా ఆడి జట్టును విజయం వైపు నడిపించాడు.అతను 28 బంతుల్లో 40 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మొత్తంగా ఆర్సీబీ 17.3 ఓవర్లలో కేవలం 1 వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించి గెలిచింది. రాజస్థాన్ బౌలర్లలో కేవలం ఆర్చర్‌కే ఒక్క వికెట్ దక్కింది.ఇదిలా ఉండగా, ఈరోజు డబుల్ హెడర్‌లో రెండో మ్యాచ్ కూడా అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్ (DC) మరియు ముంబయి ఇండియన్స్ (MI) మధ్య మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ జట్టు బౌలింగ్ ఎంచుకుంది.ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఓటమి ఎరుగకుండా నాలుగు మ్యాచ్‌లు గెలిచింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో ఆ జట్టు సమతుల్యంగా రాణిస్తోంది. మళ్లీ అదే ఫామ్‌ను కొనసాగించాలని జట్టు కాంక్షిస్తోంది.ఇంకొకవైపు ముంబయి ఇండియన్స్ మాత్రం తీవ్ర ఒత్తిడిలో ఉంది. ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన ముంబయి… నలుగురిలో ఓడిపోవడం ఆ జట్టుకు పెద్ద షాక్‌లా మారింది. స్టార్ ఆటగాళ్లు రాణించకపోవడం, బ్యాటింగ్‌లో స్థిరత లేకపోవడం కారణంగా ముంబయికి వరుస పరాజయాలు ఎదురవుతున్నాయి.ఈరోజు మ్యాచ్‌తో ముంబయి తిరిగి గెలుపు బాట పట్టే ఆశ పెట్టుకుంది. కానీ ఢిల్లీ ఫామ్ చూస్తే పని తక్కువగా అనిపించడం లేదు.
Read Also : IPL 2025: ఐపీఎల్ కామెంటేటర్లపై ఆగ్రహం వ్యక్తం చేసిన శార్దూల్ ఠాకూర్