దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు (Stock market) లాభాల్లో ముగిశాయి. ఆర్‌బీఐ ప్రకటనకు ముందు ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు కీలక వడ్డీ రేట్ల సవరించిన అనంతరం దూసుకెళ్లాయి. ఈ ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్‌లోనూ కీలక వడ్డీరేట్లను 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించిన ఆర్‌బీఐ.. ఇప్పుడు ఏకంగా 50 బేసిస్ పాయింట్లు తగ్గించింది. అప్పటి వరకు నష్టాల్లో ట్రేడయిన సూచీలు ఈ ప్రకటనతో లాభాల బాట పట్టాయి. బ్యాంక్, ఆటో, రియాల్టీ షేర్లు రాణించాయి. ఒక దశలో సెన్సెక్స్ 800 పాయింట్ల మేర పెరగ్గా.. నిఫ్టీ (NIfty) 25,000 పైన స్థిరపడింది. సెన్సెక్స్ (Sensex) ఉదయం 81,434.24 పాయింట్ల వద్ద ఫ్లాట్‌గా ప్రారంభమైంది. ఆర్‌బీఐ ప్రకటన ముందు కాసేపు నష్టాల్లో ట్రేడయింది. ఆ తర్వాత రాణించిన సూచీ ఇంట్రాడేలో 82,299.89 వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు 746 పాయింట్ల లాభంతో 82188.99వద్ద ముగిసింది. నిఫ్టీ ఇంట్రాడేలో 25,029 వద్ద గరిష్ఠాన్ని తాకి.. చివరకు 252 పాయింట్ల లాభంతో 25003 వద్ద ముగిసింది.

అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం
బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, మారుతీ సుజుకీ, ఇండస్ ఇండ్ బ్యాంక్, బజాజ్‌ఫిన్‌సర్వ్, ఎటర్నల్, టాటా స్టీల్, ఎంఅండ్‌ఎం, కోటక్ మహీంద్రా బ్యాంక్, టైటాన్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎన్టీపీసీ, అదానీ పోర్ట్స్, ఎస్బీఐ, ఇన్ఫోసిస్, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు లాభపడ్డాయి. భారతీ ఎయిర్‌టెల్, సన్‌ఫార్మా మాత్రమే నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 65.06 డాలర్ల వద్ద ట్రేడవగా.. బంగారం ఔన్సు 3,379 డాలర్ల వద్ద కొనసాగింది.ఇది మార్కెట్లో నిర్ధారిత స్థిరత్వానికి సంకేతం.
Read Also: RBI: తగ్గనున్న గృహ,ఇతర రుణాల ఈఎంఐలు