హైదరాబాద్ : తెలంగాణలో గ్యారంటీ పధకాలు, ఇతర సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతోపాటు, పెండింగ్ బిల్లుల తదితర అవసరాల కోసం రాష్ట్ర సర్కార్ రుణాన్ని సమీకరించాలని నిర్ణయించింది.ఇందుకు గాను రిజర్వ్ బ్యాంకు (Reserve Bank) నుంచి రూ.5 వేల కోట్లు తీసుకునేందుకు కసరత్తులు చేస్తోంది. దీనికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్కు ఇండెంట్ పెట్టింది. ప్రభుత్వ సెక్యూరిటీ బాండ్లను తనఖా పెట్టడం ద్వారా ఈ మొత్తాన్ని సేకరించనుంది. 19 ఏళ్ల కాలపరిమితితో రూ.1,000 కోట్లు, 22 ఏళ్ల కాలపరిమితితో రూ.1,000 కోట్లు, 23 ఏళ్ల కాలపరిమితితో రూ.2 వేల కోట్లు, 24 ఏళ్ల కాలపరిమితితో మరో రూ.1,000 కోట్లు రుణం తీసుకోనున్నట్లు ఆర్థిక శాఖ అధికవర్గాల ద్వారా తెలియవచ్చింది.

తొలి త్రైమాసికంలో
కాగా తెలంగాణ (Telangana) సర్కార్ గత నెలాఖరులో రూ.3,500 కోట్ల రుణం తీసుకుంది. దీంతో ప్రస్తుత 2025-26 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుండి జూన్ నెలాఖరు వరకూ తొలి త్రైమాసికంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.17,400 కోట్ల రుణ సమీకరణ చేసింది. రెండో త్రైమాసికం జూలై నుండి సెప్టెంబరు వరకూ రూ.12,000 కోట్లు రుణం తీసుకుంటామని రిజర్వ్ బ్యాంక్కు ప్రతిపాదనలు పంపించింది. అయితే, ఒక్క జూలైలోనే రూ.8.500 కోట్లు సేకరించింది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ నుంచి ఇప్పటి వరకూ రూ.25,900 కోట్లు రుణాన్ని సేకరించింది.
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) యజమాని ఎవరు?
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) యజమాని భారత ప్రభుత్వం. మొదట్లో RBI ఒక ప్రైవేట్ సంస్థగా ఉండేది, కానీ 1949లో జాతీయీకరణ తర్వాత పూర్తిగా భారత ప్రభుత్వానికి చెందినదిగా మారింది.
RBI ఎప్పుడు స్థాపించబడింది?
RBI ఏప్రిల్ 1, 1935లో స్థాపించబడింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: