భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) (RBI) తాజాగా ఓ కీలక ప్రకటన చేసింది. బంగారం, వెండి (Gold and silver) తాకట్టు రుణాలపై కీలక మార్పులను తీసుకొచ్చింది. ఈ మార్గదర్శకాలు 2026 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్నాయి.చిన్న మొత్తాల రుణాలు తీసుకునే వారికి ఇది గుడ్‌న్యూస్. రూ.2.5 లక్షల లోపు రుణాలపై లోన్-టు-వాల్యూ (ఎల్‌టీవీ) నిష్పత్తిని 85 శాతానికి పెంచారు. అంటే బంగారం విలువలో 85% వరకు రుణం పొందవచ్చు. రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు రుణాలపై 80 శాతం ఎల్‌టీవీ వర్తించనుంది. రూ.5 లక్షలపైగా మాత్రం పాత 75 శాతమే అమల్లో ఉంటుంది.ఇప్పటివరకు తాకట్టు బంగారం యాజమాన్యానికి పక్కా డాక్యుమెంట్లు అవసరం. కానీ ఇప్పుడు, రుణగ్రహీత డిక్లరేషన్‌నే సరిపోతుంది. ఇది గ్రామీణ ప్రజలకు పెద్ద ఊరట.
ఒకే వ్యక్తికి పదే పదే రుణాలపై పర్యవేక్షణ
ఒకరే పదేపదే తాకట్టు రుణాలు తీసుకుంటే, ఆ వ్యవహారాన్ని మనీలాండరింగ్ కింద పర్యవేక్షించనున్నారు. దీంతో నిధుల దుర్వినియోగాన్ని తగ్గించవచ్చు.
బంగారం విలువ నిర్ణయం ఇక శుద్ధత ఆధారంగా జరగనుంది. 22 క్యారెట్ల బంగారం ధరనే ప్రామాణికంగా తీసుకుంటారు. తక్కువ శుద్ధత ఉంటే ధర తగ్గించనున్నారు.
రుణగ్రహీత హాజరు తప్పనిసరి
బంగారం విలువ నిర్ణయించే సమయంలో రుణగ్రహీత హాజరుకావాల్సిందే. అంతేకాదు, అర్హత కలిగిన అస్సేయర్లు మాత్రమే బంగారం శుద్ధతను పరీక్షించాల్సిందేనని ఆర్బీఐ స్పష్టం చేసింది.
గ్రామీణ వినియోగదారులకు భారీ లాభం
ఈ మార్గదర్శకాలు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రుణగ్రహీతలకు ఎంతో ప్రయోజనం కలిగించనున్నాయి. వీటివల్ల పారదర్శకత పెరుగుతుంది, సేవల సరళత మెరుగవుతుంది.
Read Also : Ela Fitzpayne : ఇంగ్లాండ్‌లో 700 ఏళ్ల నాటి మతగురువు హత్య కేసు ఛేదన