RBI Governor Shaktikanta Das is ill.admitted to hospital

ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్‌కు అస్వస్థత..ఆస్పత్రిలో చేరిక

చెన్నై : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్‌ శక్తికాంత దాస్‌ అస్వస్థతకు గురయ్యారు. ఎసిడిటీ కారణంగా ఆయన చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. ఈ మేరకు ఆర్‌బీఐ అధికార ప్రతినిధి ఓ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం ఆయనను వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. ఆర్బీఐ గవర్నర్‌ ఆరోగ్యం నిలకడగానే ఉన్నదని, ఎలాంటి ఆందోళన చెందనక్కరలేదని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. మరో రెండు, మూడు గంటల్లో ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యే అవకాశం ఉన్నదన్నారు.

కాగా, ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ పదవీకాలం వచ్చే నెల 10న ముగియనుంది. 1980 తమిళనాడు క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి శ‌క్తికాంత దాస్‌.. 2018 డిసెంబ‌ర్ 12న ఆర్బీఐ గ‌వ‌ర్నర్‌గా బాధ్యత‌లు చేపట్టారు. అప్పటి వ‌ర‌కు ఆర్బీఐ గ‌వ‌ర్నర్‌గా ఉర్జిత్ ప‌టేల్ త‌న ప‌ద‌వీ కాలానికి ముందే రాజీనామా చేయ‌డంతో ఆయ‌న స్థానంలో కేంద్రం శ‌క్తికాంత దాస్‌ను నియ‌మించింది. అప్పటి నుంచి ఆయన పదవిలో కొనసాగుతున్నారు. 2021 డిసెంబర్‌ 10న మూడేళ్ల పదవీ కాలం ముగిసినప్పటికీ మ‌రో మూడేండ్ల పాటు ప‌ద‌వీకాలన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ ప్రకారం వచ్చే నెల డిసెంబర్‌తో ఆయన పదవీ కాలం ముగుస్తుంది. అయితే, మరోసారి ఆయన్ని ఆర్బీఐ గవర్నర్‌గా కొనసాగించాలని కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఐదేండ్ల కంటే ఎక్కువకాలం ఆర్బీఐ గవర్నర్‌గా దాస్ ఉన్నారు. మరోసారి ఆయన పదవీకాలం పొడిగిస్తే.. బెనగల్ రామారావు తర్వాత అత్యధిక కాలం ఆర్బీఐ గవర్నర్‌గా చేసిన వ్యక్తిగా దాస్‌ నిలవనున్నారు. రామారావు 1949-1957 మధ్య ఏడున్నర సంవత్సరాల పాటు ఆర్బీఐ చీఫ్ బాధ్యతలు నిర్వర్తించారు. ఇప్పటివరకు ఆయనే అత్యధిక కాలం ఆ పదవిలో ఉన్నారు. ఇప్పుడు ఆయన తర్వాత అత్యధిక కాలం ఆర్బీఐ గవర్నర్‌గా పనిచేసిన వ్యక్తిగా దాస్‌ నిలవనున్నారు.

Related Posts
కేంద్ర మంత్రి బండి సంజయ్ కి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ సూటి ప్రశ్న

కేంద్ర మంత్రి బండి సంజయ్ తాజాగా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ తీవ్రంగా స్పందించారు. "బీజేపీ భావజాలం ఉన్నవారికే అవార్డులు ఇస్తారా?" అంటూ బండి Read more

ఏపీకి నాయ‌క‌త్వం వ‌హించే సామ‌ర్థ్యం కేవలం పవన్ కే ఉంది – విజయసాయి రెడ్డి
vijayasai cbn

వైసీపీ సీనియర్ నేత, ఎంపీ విజయసాయి రెడ్డి తాజాగా ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని ఉద్దేశిస్తూ.. 75 ఏళ్ల వృద్ధుడు ఆంధ్రప్రదేశ్‌కు Read more

కిస్నా డైమండ్ & గోల్డ్ జ్యువెలరీ “షాప్ అండ్ విన్ కార్” ఆఫర్
Kisna Diamond & Gold Jewelery brings joy with its Shop and Win Car offer

గుంటూరు : భారతీయ ఆభరణాల పరిశ్రమలో సుప్రసిద్ధమైన హరి కృష్ణ గ్రూప్ యొక్క ప్రముఖ బ్రాండ్ అయిన కిస్నా డైమండ్ & గోల్డ్ జ్యువెలరీ , సత్తెనపల్లిలోని Read more

రిపబ్లిక్ డే పరేడ్లో ఏపీ శకటానికి 3వ స్థానం
AP Shakatam in Delhi Republ

రిపబ్లిక్ డే సందర్భంగా ఢిల్లీ కర్తవ్యపథ్‌లో నిర్వహించిన శకటాల ప్రదర్శనలో ఆంధ్రప్రదేశ్ శకటం మూడో స్థానాన్ని దక్కించుకుంది. రసాయనాల వాడకం లేకుండా, సంప్రదాయ ఏటికొప్పాక బొమ్మలతో ప్రత్యేకంగా Read more