हिन्दी | Epaper

Raviteja Father Dies : రవితేజ తండ్రి కన్నుమూత

Sudheer
Raviteja Father Dies : రవితేజ తండ్రి కన్నుమూత

తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు మాస్ మహారాజా రవితేజ (Raviteja)కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. రవితేజ తండ్రి భూపతి రాజు రాజగోపాల్ గారు (వయసు 90) గత రాత్రి తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, హైదరాబాదులోని రవితేజ నివాసంలో మరణించారు. ఈ వార్తతో అభిమానులు, సినీ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు.

వృత్తిరీత్యా ఫార్మసిస్ట్‌గా సేవలు

భూపతి రాజు రాజగోపాల్ (Bhupathiraju Rajagopal) గారు తన వృత్తి జీవితంలో ఫార్మసిస్ట్‌గా పని చేశారు. ప్రజలకు సేవ చేయడమే తన ధ్యేయంగా పని చేసిన ఆయన ఎంతో శ్రద్ధగా, నిబద్ధతతో తన వృత్తిని నిర్వహించారు. కుటుంబానికి ఆర్థికంగా బలమిస్తూ తన కుమారులకు మంచి విలువలు, విద్య అందించారు. ఆయన శ్రమతోనే రవితేజ సినీ రంగంలో స్థిరపడగలిగారు.

అభిమానుల సంతాపం

రాజగోపాల్ ముగ్గురు కుమారులు. రవితేజ, రఘు, మరియు భరత్ రాజు. ఈ ముగ్గురిలో రవితేజ ఇప్పటికే సినిమా రంగంలో ప్రముఖుడిగా వెలుగొందుతున్నారు. భరత్ రాజు దురదృష్టవశాత్తు కొన్నేళ్ల క్రితం రోడ్డుప్రమాదంలో మృతిచెందారు. ఇప్పుడు తండ్రి మరణం రవితేజ కుటుంబాన్ని మరింత శోకసంద్రంలోకి నెట్టింది. అభిమానులు, ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు కుటుంబానికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Read Also : YCP : ప్రసన్నకుమార్ రెడ్డిపై ఏపీ హైకోర్టు ఆగ్రహం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అల్లు ఇంట ‘విరోష్’ జంట సందడి

అల్లు ఇంట ‘విరోష్’ జంట సందడి

హైదరాబాద్ టీటీడీ ఆలయంలో విజయ్-రష్మిక

హైదరాబాద్ టీటీడీ ఆలయంలో విజయ్-రష్మిక

సురేఖ వాణి కోసం సుప్రీత నిర్ణయం, నెటిజన్ల ప్రశంసలు

సురేఖ వాణి కోసం సుప్రీత నిర్ణయం, నెటిజన్ల ప్రశంసలు

యుద్ధం ఎఫెక్ట్.. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో విమాన సర్వీసులు రద్దు

యుద్ధం ఎఫెక్ట్.. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో విమాన సర్వీసులు రద్దు

కొడుకు సినిమా చూడను, సునీల్ శెట్టి షరతు చెప్పారు

కొడుకు సినిమా చూడను, సునీల్ శెట్టి షరతు చెప్పారు

నైటికి రేటెంత అని అడుగుతున్నారు – రేణూ దేశాయ్

నైటికి రేటెంత అని అడుగుతున్నారు – రేణూ దేశాయ్

‘ది కేరళ స్టోరీ-2’కి షాకింగ్ కలెక్షన్లు

‘ది కేరళ స్టోరీ-2’కి షాకింగ్ కలెక్షన్లు

విజయ్ దేవకొండ-రష్మిక పెళ్లిలో ధరించిన బంగారు అభరాణలపై చర్చ

విజయ్ దేవకొండ-రష్మిక పెళ్లిలో ధరించిన బంగారు అభరాణలపై చర్చ

కోహ్లి రికార్డును బ్రేక్ చేసిన రష్మిక

కోహ్లి రికార్డును బ్రేక్ చేసిన రష్మిక

ఆహాలో హాట్ స్పాట్ 2 మచ్ స్ట్రీమింగ్, సీక్వెల్ సందడి మొదలు

ఆహాలో హాట్ స్పాట్ 2 మచ్ స్ట్రీమింగ్, సీక్వెల్ సందడి మొదలు

కేరళ స్టోరీ 2 రిలీజ్‌కు గ్రీన్ సిగ్నల్, స్టే రద్దు

కేరళ స్టోరీ 2 రిలీజ్‌కు గ్రీన్ సిగ్నల్, స్టే రద్దు

కొత్త మూవీ ప్రకటించిన అనిల్ రావిపూడి

కొత్త మూవీ ప్రకటించిన అనిల్ రావిపూడి

📢 For Advertisement Booking: 98481 12870