Ravichandran Ashwin ధోనీ ఇచ్చిన కానుక ఇదేనని వివరణ అశ్విన్

Ravichandran Ashwin : ధోనీ ఇచ్చిన కానుక ఇదేనని వివరణ : అశ్విన్

Ravichandran Ashwin : ధోనీ ఇచ్చిన కానుక ఇదేనని వివరణ : అశ్విన్ రవిచంద్రన్ అశ్విన్ టీమిండియాలో పోరాటపటిమకు మారుపేరుగా నిలిచిన అగ్రశ్రేణి ఆఫ్ స్పిన్నర్.ఓటమిని తలొగ్గని ఈ తమిళ తంబి, అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినప్పటికీ, ఐపీఎల్‌లో మాత్రం తన మాయాజాలంతో అభిమానులను మరోసారి అలరించబోతున్నాడు. 18వ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున బరిలోకి దిగనున్నాడు.కెరీర్ చివరి దశలో స్వస్థలం తమిళనాడుకు చెందిన ఫ్రాంచైజీ తరఫున ఆడే అవకాశం రావడం అశ్విన్‌కి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం.దీన్ని తనకు పెద్ద గిఫ్ట్‌లా భావిస్తున్నాడు. ముఖ్యంగా మహేంద్ర సింగ్ ధోనీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెబుతున్నాడు.ఈ సందర్భంగా ఓ ఆసక్తికర విషయం బయటపెట్టాడు.”ధర్మశాలలో నా 100వ టెస్టు ఆడాను. ఆ మ్యాచ్ సందర్భంగా బీసీసీఐ ప్రత్యేకంగా కార్యక్రమం ఏర్పాటు చేసి మెమెంటోను అందించింది. అయితే ఆ వేడుకకు ధోనీ హాజరవుతాడని ఆశపడ్డాను.ఆ జ్ఞాపికను అతని చేతుల మీదుగా స్వీకరించాలని ఎంతో ఎదురుచూశాను. కానీ అది సాధ్యపడలేదు.

Ravichandran Ashwin ధోనీ ఇచ్చిన కానుక ఇదేనని వివరణ అశ్విన్
Ravichandran Ashwin ధోనీ ఇచ్చిన కానుక ఇదేనని వివరణ అశ్విన్

నాలో కొంత నిరాశ కలిగింది.అదే నా చివరి అంతర్జాతీయ మ్యాచ్ అయిపోయిందని భావించాను.అయితే, ధోనీ తర్వాత నాకొక అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చాడు.ఊహించని విధంగా చెన్నై సూపర్ కింగ్స్‌లోకి తిరిగి తీసుకోవడం ద్వారా నా కెరీర్‌కు కొత్త జీవితాన్ని ఇచ్చాడు.ధోనీ వల్లనే ఈసారి సీఎస్కేలో ఆడే అవకాశం దక్కింది.ఇంత దశలో అంతకంటే మంచి కానుక మరేదీ ఉండదని అనిపిస్తోంది.ధోనీకి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెబుతున్నాను” అంటూ తన ఆనందాన్ని వ్యక్తపరిచాడు.అశ్విన్ ఇప్పటికీ గరిష్టస్థాయిలో క్రికెట్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడు.సీఎస్కే తరఫున బరిలోకి దిగబోతుండటంతో, అభిమానుల్లో ఉత్సాహం. మరోసారి తన మాయాజాలంతో ప్రత్యర్థులను దెబ్బకొట్టడానికి అశ్విన్ సిద్ధంగా ఉన్నాడు.అతని అనుభవం ప్రతిభ సీఎస్కేకు ఈ సీజన్‌లో కీలక బలంగా మారనుంది.

Related Posts
రోహిత్ ను తక్కువ అంచనా వేయొద్దు.
రోహిత్ ను తక్కువ అంచనా వేయొద్దు.

ఛాంపియ‌న్స్ ట్రోఫీలో క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్ - పాకిస్థాన్ మ్యాచ్. ఫిబ్రవరి 23న దుబాయ్ వేదికగా చిరకాల ప్రత్యర్థులు భారత్ - పాకిస్థాన్ Read more

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్

ఈ రోజు చాంపియన్స్ ట్రోఫీలో భారత్ మరియు న్యూజిలాండ్ జట్లు ఆడుతున్నాయి. ఈ టోర్నీలో ఇది లీగ్ స్టేజ్ చివరి మ్యాచ్. గ్రూప్-ఏ లో భాగంగా జరిగిన Read more

IND vs AUS: రోహిత్ సేన ఘోర పరాజయం..
ind vs aus

ఆడిలైడ్ డే-నైట్ టెస్ట్‌లో టీమిండియా ఘోర పరాజయం: ఆసీస్ ఆధిపత్యం నిలబెట్టింది భారత జట్టు ఆడిలైడ్ వేదికగా జరిగిన డే-నైట్ టెస్టులో ఆస్ట్రేలియా జట్టు చేతిలో తీవ్ర Read more

విశాఖలో బ్యాడ్మింటన్ అకాడమీ నిర్మాణానికి భూమిపూజ చేసిన పీవీ సింధు
PV Sindhu Bhoomi Puja for Badminton Academy in Visakha

విశాఖపట్నం: విశాఖపట్నంలోని పెద గదిలి కూడలి సమీపంలో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన స్థలంలో బ్యాడ్మింటన్ అకాడమీ నిర్మాణానికి ఒలింపిక్ ప‌త‌క విజేత‌, భార‌త స్టార్ బ్యాడ్మింట‌న్ ప్లేయ‌ర్ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *