Ration cards: తెలంగాణ (Telangana) ప్రభుత్వం ఆహార భద్రతను బలోపేతం చేయడమే లక్ష్యంగా పౌరసరఫరాల వ్యవస్థను మెరుగుపరచేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా, అనవసరంగా ఉండిపోయిన లేదా ఉపయోగించని రేషన్ కార్డు (Ration cards) లపై దృష్టి సారించింది. వరుసగా ఆరు నెలల పాటు రేషన్ సరుకులు వినియోగించుకోని కార్డులను రద్దు చేయాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. ఈ మేరకు అవసరమైన సమాచారాన్ని ఇప్పటికే అన్ని మండల కేంద్రాల నుంచి అధికారులు సేకరించారు.

ఆరు నెలలుగా వినియోగం లేని కార్డుల రద్దు నిర్ణయం
పౌరసరఫరాల శాఖ తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం, ఈ క్రమంలో, గత ఆరు నెలల వ్యవధిలో ఒక్కసారి కూడా రేషన్ సరుకులు పొందని వారి సంఖ్య 78,842గా తేలింది. ఈ కార్డులన్నింటినీ తక్షణమే రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
రద్దు చేయబోయే కార్డులపై సమగ్ర విచారణ
ఈ కార్డుల రద్దు ప్రక్రియను అతి జాగ్రత్తగా అమలు చేసేందుకు ప్రభుత్వం క్షేత్ర స్థాయిలో సమగ్ర విచారణ చేపట్టింది. అన్ని జిల్లాల కలెక్టర్లకు పంపించి, క్షేత్ర స్థాయిలో సమగ్ర విచారణ చేపట్టింది.
అధికంగా రద్దు అవుతున్న జిల్లాలు
ఈ చర్యల్లో భాగంగా అత్యధిక సంఖ్యలో రద్దు చేయబోయే రేషన్ కార్డులు నల్గొండ, మేడ్చల్-మల్కాజ్‌గిరి, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో ఇలా నిరుపయోగంగా ఉన్న కార్డులు అధిక సంఖ్యలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
అర్హులకే లబ్ధి
ఈ చర్యల వెనుక ప్రభుత్వం ఉద్దేశించినది ఒక్కటే అర్హులైన పేదలకు మాత్రమే నిత్యావసర సరుకులు అందించాలి. ప్రస్తుతం అనర్హుల చేతిలో ఉన్న రేషన్ కార్డులు, నకిలీ డేటా వల్ల నిజమైన లబ్ధిదారులకు నష్టం జరుగుతుందని గుర్తించిన ప్రభుత్వం, పథకాలను పునఃపరిశీలిస్తోంది. రద్దైన కార్డుల బదులుగా, కొత్తగా అర్హులైన వారికి కార్డులు మంజూరు చేసే దిశగా కార్యాచరణ కొనసాగుతోంది.