కొత్తగా 9 లక్షల మందికి పైగా కార్డులు మంజూరు: మంత్రి నాదెండ్ల
విజయవాడ : రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు 25 నుంచి 31 వరకూ రేషన్ స్మార్ట్ కార్డులు పంపిణీ (Ration Card Distribution) చేయనున్నట్లు పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటిం చారు. ఎక్కడా అక్రమాలకు ఆస్కారం లేకుండా స్మార్ట్ కార్డులు (Smart cards) రూపొందించామని తెలిపారు. కొత్తగా 9 లక్షల మందికి పైగా రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర స్థాయిలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణు ఈకార్డులు అందిస్తారని, ఇంకా జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ఇస్తారని చెప్పారు. అలానే కొత్తగాఇచ్చే రేషన్కార్డులు అన్ని ఉచితంగా అందిస్తా మని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. జాతీయ ఆహర భద్రతా చట్టం ప్రకారం కేంద్రం సాయంతో రాష్ట్ర ప్రభుత్వం రైస్ కార్డులు ఇస్తుందని మంత్రి మనోహర్ తెలిపారు. పాత విధానాన్ని మార్చి స్మార్ట్ రైస్ కార్డులు ఇచ్చేందుకు డిజిటలైజ్ చేశామని, అలానే కార్డులపై ఎక్కడా నాయకుల ఫొటోలు ఉండకుండా డిజైన్ చేశామని వెల్లడించారు.

కుటుంబ సభ్యుల ఫొటోలు మాత్రమే ఈ కార్డులో ఉండనున్నాయని అన్నారు. ఈ స్మార్ట్ రేషన్ కార్డులను డెబిట్, క్రెడిట్ కార్డు సైజులలో ఇవ్వబోతున్నామని, ఇంకా కుటుంబ సభ్యుల వివరాలు, కార్డు నెంబర్లు కనిపించేలా చర్యలు తీసుకున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.క్యూఆర్ కోడ్ ద్వారా ట్రాన్సక్షన్ జరిగిన వెంటనే సెంట్రల్ ఆఫీ సులో తెలుస్తుందని మంత్రి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 29,786 రేషన్ షాపులలో ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు ఇవ్వాలని ఆదేశిస్తున్నామని మంత్రి తెలిపారు. 65 ఏళ్లు దాటిన వృద్ధులకు 26వ తేదీ నుంచి 30వ తేదీల మధ్య సరుకులు హోం డెలివరీ చేస్తామని అన్నారు. దీపం పధకంలో ఎలాంటి లోపం లేకుండా 3 ఆయిల్ కంపెనీలతో ప్రతి వారం సమీక్షలు చేస్తున్నామని చెప్పారు. రెండవ విడతలో ఈ రోజు వరకూ 93 లక్షల 86 వేల మందికి డెలివరీ ఇచ్చామని అలానే లబ్దిదారులు దీపం 2 పథకాన్ని ఈ నెల 31వ తేదీలోపు వినియోగించుకో వాలని సూచించారు.
Read Hindi News : hindi.vaartha.com
Read also : Launch: శ్రీహరికోట నుంచి నిసార్ ఉపగ్రహం, GSLV-F16 ప్రయోగం