Today Rasi Phalalu : రాశి ఫలాలు – 02 నవంబర్ 2025 Horoscope in Telugu

Read Time:  1 min
Today Rasi Phalalu
Today Rasi Phalalu
FONT SIZE
GET APP

Today Rasi Phalalu : రాశి ఫలాలు – 02 నవంబర్ 2025 Horoscope in Telugu – Vaartha Telugu

Aries

మేష రాశి

మేషరాశి వారికి ఈ రోజు ప్రయాణాలకు అనుకూలమైనదే అయినా, తొందరపాటు మాత్రం మంచిది కాదు. దూరప్రాంతాలకు వెళ్తూ రవాణా, సమయపట్టిక, అవసరమైన వస్తువులు ముందుగానే సిద్ధం చేసుకోవడం ఉత్తమం.

…ఇంకా చదవండి
Taurus

వృషభరాశి

ఈ రోజు మీరు మీ ఆత్మీయ వర్గంలో ఇబ్బందుల్లో పడి ఉండేవారికి రహస్యంగా లేదా పరోక్షంగా సహాయపడే అవకాశం ఉందొ లేదా మీలో అలాంటి భావన ఉంటుంది. ప్రత్యక్షంగా చూపించే సహాయం కావాలనే భావన లేకపోయినా, నిఖార్సయిన మద్ధతు.

…ఇంకా చదవండి
Gemini

మిథున రాశి

మిథునరాశివారికి ఈ రోజు కొన్ని అనుకోని పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. కొంత ఆందోళన కలిగించే పరిణామాలు జరిగినా మీరు చాకచక్యంగా, తెలివిగా వాటిని ఎదుర్కొని విజయం సాధిస్తారు. మానసిక ఒత్తిడిని నియంత్రించడం ద్వారా మీ నిర్ణయాలు మరింత ఫలప్రదంగా మారతాయి.

…ఇంకా చదవండి
Cancer

కర్కాటక రాశి

కర్కాటకరాశివారికి ఈ రోజు బంధువుల నుండి కీలకమైన సమాచారం అందే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం మరింత బలపడుతుంది. కొంతకాలంగా ఎదురుచూస్తున్న వార్త లేదా సమాచారం ఈరోజే అందవచ్చు.

…ఇంకా చదవండి
Leo

సింహ రాశి

సింహరాశివారికి ఈ రోజు భాగస్వామ్య వ్యాపారాలలో కొంత స్వల్ప మార్పులు చోటుచేసుకుంటాయి. భాగస్వాములతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి. చిన్నచిన్న అపార్థాలు వచ్చినా అవి త్వరగా పరిష్కారమవుతాయి.

…ఇంకా చదవండి
Virgo

కన్యా రాశి

కన్యరాశివారికి ఈ రోజు కొత్త ఒప్పందాలు లేదా పెట్టుబడుల విషయంలో కొంత నిదానం అవసరం. ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలు తర్వాత ఇబ్బందులు కలిగించవచ్చు. కాబట్టి ప్రతి విషయాన్ని సమీక్షించి ముందుకు సాగండి.

…ఇంకా చదవండి
Libra

తులా రాశి

తులరాశివారికి ఈ రోజు కుటుంబ సభ్యుల నుండి విశేషమైన ప్రోత్సాహం లభిస్తుంది. మీ ఆలోచనలకు, నిర్ణయాలకు వారు పూర్తి మద్దతు ఇస్తారు. దీని ఫలితంగా కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది.

…ఇంకా చదవండి
Scorpio

వృశ్చిక రాశి

వృశ్చికరాశివారికి ఈ రోజు అత్యంత అనుకూలమైన సమయం. ముఖ్యంగా నూతన పెట్టుబడులు, వ్యాపార విస్తరణల విషయంలో అదృష్టం మీ వైపున ఉంటుంది. ఆర్థిక విషయాల్లో మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు.

…ఇంకా చదవండి
Sagittarius

ధనుస్సు రాశి

ధనుస్సురాశివారికి ఈ రోజు కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. ఈ పరిచయాలు భవిష్యత్తులో మీకు ఉపయోగపడే విధంగా మారతాయి. సమాజంలో మీ పేరు, ప్రతిష్ట పెరుగుతుంది. కొత్త వ్యక్తులతో కలిసే సందర్భాల్లో మీరు చూపించే సౌమ్యభావం,

…ఇంకా చదవండి
Capricorn

మకర రాశి

మకరరాశివారికి ఈ రోజు వ్యాపారాభివృద్ధికి అత్యంత అనుకూలమైన సమయం. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాలు మంచి లాభాలను అందిస్తాయి. కొత్త ఒప్పందాలు లేదా కాంట్రాక్టులు దక్కించుకునే అవకాశం ఉంటుంది.

…ఇంకా చదవండి
Aquarius

కుంభ రాశి

కుంభరాశివారికి ఈ రోజు కొంత జాగ్రత్త అవసరం. ముఖ్యంగా వివాదాస్పద అంశాలు ఎదురైనప్పుడు మౌనం వహించడం మంచిది. అవసరం లేని చర్చల్లో పాల్గొనకుండా, సమతుల్యంగా వ్యవహరించండి. మీ మాటలు ఇతరులు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది కాబట్టి..

…ఇంకా చదవండి
Pisces

మీన రాశి

మీనరాశివారికి ఈ రోజు దూర ప్రాంతాల్లో ఉన్న స్నేహితులు లేదా సన్నిహిత వర్గం నుండి సహాయం లభించే అవకాశం ఉంది. మీరు ఎదుర్కొంటున్న కొన్ని విషయాలకు వారు ఆచరణాత్మక సలహా ఇవ్వవచ్చు లేదా అవసరమైన మద్దతు అందించవచ్చు.

…ఇంకా చదవండి
Sun

వారం – వర్జ్యం

తేది : 02-11-2025,ఆదివారం

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, కార్తీక మాసం(Karthika Masam), దక్షిణాయణం శరద్ ఋతువు, శుక్లపక్షం(Shukla Paksham)

ఏకాదశి ఉ.7.32 , ద్వాదశి తె.5.07 పూర్వాభాద్ర సా.5.39 , స్వాతి కార్తె
వర్జ్యం: రా.7.00-9.13
దు.ము : సా.4.01 – 4.50
రాహుకాలం: సా.4.30-6.00

Uday Kumar

రచయిత గురించి

Uday Kumar

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.