Today Rasi Phalalu : రాశి ఫలాలు – 01 నవంబర్ 2025 Horoscope in Telugu

Read Time:  1 min
Today Rasi Phalalu
Today Rasi Phalalu
FONT SIZE
GET APP

రాశి ఫలాలు – 01 నవంబర్ 2025 Horoscope in Telugu – Vaartha Telugu

Aries

మేష రాశి

ఈ రోజు మేషరాశివారికి అనుకూలమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి. మీరు అనుకున్న పనులు ఒక్కొక్కటిగా సాఫీగా పూర్తవుతాయి. గతంలో నిలిచిపోయిన కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు ఇప్పుడు పురోగతి సాధిస్తాయి.

…ఇంకా చదవండి
Taurus

వృషభరాశి

ఈ రోజు వృషభరాశివారు తమ మాట తీరు, నిర్ణయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. మొండి పట్టుదల లేదా అహంకారం ప్రదర్శించడం వలన మీరు చేసిన సహాయసహకారాలకు తగిన గుర్తింపు రాకపోవచ్చు. మీ ఉద్దేశ్యం మంచిదే అయినా, ఇతరులకు అది సరిగా అర్థం కావడం కష్టమవుతుంది.

…ఇంకా చదవండి
Gemini

మిథున రాశి

ఈ రోజు మిథునరాశివారు తల్లిదండ్రులు మరియు వృద్ధుల పట్ల గౌరవభావం, సేవా తత్పరతతో వ్యవహరిస్తారు. వారి ఆశీర్వాదం మీ జీవితంలో శుభప్రభావాన్ని చూపిస్తుంది. కుటుంబ సంబంధాలు మరింత బలపడతాయి.

…ఇంకా చదవండి
Cancer

కర్కాటక రాశి

ఈ రోజు కర్కాటకరాశివారికి వృత్తి, వ్యాపార రంగాల్లో నూతన ఆలోచనలు మరియు పద్ధతులు విజయాన్ని తీసుకువస్తాయి. కొత్త మార్గాలను అన్వేషించే ధైర్యం ఫలితాన్నిస్తుంది. సహచరులు, భాగస్వాముల సహకారం లభిస్తుంది.

…ఇంకా చదవండి
Leo

సింహ రాశి

ఈ రోజు సింహరాశి వారికి కుటుంబ జీవితంలో శాంతి నెలకొనే రోజు. ఇటీవల ఏర్పడిన చిన్నపాటి విభేదాలు, అపార్థాలు ఈ రోజు సర్దుబాటు అవుతాయి. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు ఓర్పు ప్రదర్శించడం ద్వారా సంబంధాలు మరింత బలపడతాయి.

…ఇంకా చదవండి
Virgo

కన్యా రాశి

కన్యరాశి వారికి ఈ రోజు కొంత మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. మీరు చేపట్టిన కార్యక్రమాలు కొంత ఆలస్యం అయినా చివరికి సఫలమవుతాయి. మీరు చూపించే పట్టుదల, క్రమశిక్షణ మరియు సమయపాలన వల్ల మీ ప్రయత్నాలు ఫలిస్తాయి.

…ఇంకా చదవండి
Libra

తులా రాశి

తులరాశి వారికి ఈ రోజు భావోద్వేగ పరమైన ఒడిదుడుకులు ఉండే అవకాశం ఉంది. చిన్నచిన్న విషయాల మీద వివాదాలు తలెత్తే అవకాశం ఉన్నందున, కోపతాపాలకు దూరంగా వుండడం ఉత్తమం. మీ శాంత స్వభావం, సమతుల్య ఆలోచనలతో సమస్యలను సులభంగా పరిష్కరించగలుగుతారు.

…ఇంకా చదవండి
Scorpio

వృశ్చిక రాశి

వృశ్చికరాశి వారికి ఈ రోజు ఆర్థిక పరంగా కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ, అవసరమైన సమయానికి డబ్బు లభించే అవకాశాలు ఉన్నాయి. ఖర్చులు పెరిగినా అవి ముఖ్యమైన అవసరాలకే పరిమితమవుతాయి. సకాలంలో సహాయం అందడం వల్ల ఆర్థిక భారాన్ని తట్టుకోగలుగుతారు.

…ఇంకా చదవండి
Sagittarius

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారికి ఈ రోజు అనుకూలతలతో నిండిన రోజు. మీరు ఎదురుచూస్తున్న ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి అవుతాయి. గతంలో నిలిచిపోయిన పనులు కూడా తిరిగి ముందుకు సాగుతాయి.అధికారుల సహకారం లభించి, మీ ప్రణాళికలు సాఫల్యవంతమవుతాయి.

…ఇంకా చదవండి
Capricorn

మకర రాశి

మకరరాశి వారికి ఈ రోజు జాగ్రత్తగా వ్యవహరించాల్సిన సమయం. మీకు అనుకూలమైన అవకాశాలు అంచుల వరకూ వచ్చినప్పటికీ, అవి చేజారిపోకుండా ఉండేందుకు అప్రమత్తంగా ఉండాలి. నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించి, విశ్లేషించి ముందుకు సాగడం మంచిది.

…ఇంకా చదవండి
Aquarius

కుంభ రాశి

కుంభరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. చాలా కాలంగా నిలిచిపోయిన భూ, స్థలాలకు సంబంధించిన కోర్టు వ్యవహారాలు చివరకు పరిష్కార దశకు చేరుకుంటాయి. మీకు అనుకూలమైన తీర్పులు వచ్చే అవకాశం ఉంది.

…ఇంకా చదవండి
Pisces

మీన రాశి

మీనరాశి వారికి ఈ రోజు ఆర్థికపరంగా జాగ్రత్త అవసరం. లావాదేవీలు చేయడానికి ముందు ప్రతిదీ బాగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. త్వరపడటం లేదా ఇతరుల మాట నమ్మి పెద్ద మొత్తాలు ఖర్చు చేయడం వల్ల ఇబ్బందులు కలగవచ్చు.

…ఇంకా చదవండి
Sun

వారం – వర్జ్యం

తేది : 01-11-2025,శనివారం

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, కార్తీక మాసం(Karthika Masam), దక్షిణాయణం శరద్ ఋతువు, శుక్లపక్షం(Shukla Paksham)

దశమి ఉ.9.09 , శతభిషా సా.6.14 , స్వాతి కార్తె
వర్జ్యం: రా.9.17-10.02
దు.ము : ఉ.6.06 – 7.40
శుభముహూర్తం: ఉ.8.15-8.45
రాహుకాలం: ఉ.9.00-10.30

Uday Kumar

రచయిత గురించి

Uday Kumar

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.