Today Rasi Phalalu : రాశి ఫలాలు – 22 నవంబర్ 2025 Horoscope in Telugu

Read Time:  1 min
Today Rasi Phalalu
Today Rasi Phalalu
FONT SIZE
GET APP

రాశి ఫలాలు – 22 నవంబర్ 2025 Horoscope in Telugu – Vaartha Telugu

Aries

మేష రాశి

ముఖ్యమైన వ్యవహారాలు కొంత ఆలస్యంగా పూర్తవుతున్నాయని మీరు భావించవచ్చు. చేతిలో ఉన్న పనుల్లో అనుకోని ఆటంకాలు, ఇతరుల సహకారం తగ్గడం లేదా అవసరమైన సమాచారం ఆలస్యంగా రావడం వంటి కారణాలు ఉండొచ్చు.

…ఇంకా చదవండి
Taurus

వృషభరాశి

బంధువుల నుండి శుభవార్తలు అందుకోవడం మీ రోజును మరింత ఉల్లాసంగా మార్చుతుంది. కుటుంబంలో పెండింగ్‌లో ఉన్న ఒక ముఖ్యమైన విషయం పూర్తి కావడం మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది.

…ఇంకా చదవండి
Gemini

మిథున రాశి

ప్రత్యర్థుల విషయంలో జాగ్రత్తతో మెలగాల్సిన సమయమిది. మీ పని తీరు లేదా విజయాలను చూసి కొంతమంది వ్యక్తులు అనవసరంగా ఆటంకాలు సృష్టించే అవకాశం ఉంది.

…ఇంకా చదవండి
Cancer

కర్కాటక రాశి

ఎడ్డమంటే తెడ్డమనే వ్యక్తుల వల్ల కొన్ని అనుకోని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. చిన్న విషయానికే పెద్ద గొడవ సృష్టించడం, మీ నిర్ణయాలను తప్పుగా అర్థం చేసుకోవడం లేదా మీ పనుల్లో జోక్యం చేసుకోవడం..

…ఇంకా చదవండి
Leo

సింహ రాశి

శత్రువర్గం లేదా మీపై అసూయతో ఉండే వ్యక్తులపై మీరు ఈరోజు ప్రత్యేకంగా దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఎవరి మీద నమ్మకం పెట్టుకోవాలో, ఎవరిని దూరంగా ఉంచాలో బాగా గ్రహిస్తారు.

…ఇంకా చదవండి
Virgo

కన్యా రాశి

చర్చలు, మంతనాలు ఎక్కువయ్యే రోజు ఇది. కుటుంబంలో తీసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు మీపై బాధ్యతగా పడే అవకాశం ఉంది.ఎవరి అభిప్రాయం వినాలి, ఎలా స్పందించాలి, ఏ నిర్ణయం అందరికీ మంచిగా ఉంటుంది.

…ఇంకా చదవండి
Libra

తులా రాశి

మనస్సు విశ్రాంతి కోరుకునే సమయం ఇది. అయితే పరిస్థితులు మాత్రం అంతగా సహకరించకపోవచ్చు. పనులు ఒక్కదాని వెనుక మరొకటి రావడం, కుటుంబం లేదా కార్యాలయానికి సంబంధించిన బాధ్యతలు పెరగడం వల్ల సడలింపు కష్టమవుతుంది.

…ఇంకా చదవండి
Scorpio

వృశ్చిక రాశి

శ్రమకు తగిన ప్రతిఫలం అందుకునే మంచి రోజు ఇది. ఇంతకాలం మీరు కట్టుదిట్టంగా చేసిన కృషికి ఇప్పుడే స్పష్టమైన ఫలితాలు కనిపించడం మొదలవుతుంది.

…ఇంకా చదవండి
Sagittarius

ధనుస్సు రాశి

అనుకోని అతిథులు ఇంటికి రావడంతో ఇంట్లో హర్షోల్లాసాలు నెలకొంటాయి. చాలాకాలం తర్వాత కలుసుకునే వ్యక్తులు కావడంతో ఆనాటి జ్ఞాపకాలు రీ-ఫ్రెష్ అవుతాయి.

…ఇంకా చదవండి
Capricorn

మకర రాశి

ఆస్తి వివాదాలు ఈరోజు సానుకూల దిశగా పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఇంతకాలం నిలిచిపోయిన చర్చలు స్పష్టతకు రావడం, మీరు కోరుకున్న విధంగా తీర్పు లేదా నిర్ణయం రావడం వంటి శుభసూచనలు కనిపిస్తున్నాయి.

…ఇంకా చదవండి
Aquarius

కుంభ రాశి

నూతన విద్యా అవకాశాలు ఈరోజు మీ జీవితంలోకి ప్రవేశించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉన్నత విద్య, ఆన్‌లైన్ కోర్సులు, స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ వంటి విషయాల్లో అనుకోని అవకాశాలు రావచ్చు.

…ఇంకా చదవండి
Pisces

మీన రాశి

సన్నిహితుల నుండి సహాయం, సహకారం లభించడం ఈరోజు మీకు ముఖ్యమైన బలమైన అంశం. కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా మీకు దగ్గరగా ఉన్నవారి సహకారం వల్ల ఇంతకాలం నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి.

…ఇంకా చదవండి
Sun

వారం – వర్జ్యం

తేది : 22-11-2025,శనివారం

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, మార్గశిర మాసం(Margashira Masam), దక్షిణాయణం శరద్ ఋతువు, శుక్లపక్షం(Shukla Paksham)

విదియ సా.5.10 జ్యేష్ఠ సా.4.45 అనురాధ కార్తె
వర్జ్యం: రా.9.11-9.58
దు.ము : ఉ.6.16 – 7.49
శుభముహూర్తం: ఉ.5.30-6.15
రాహుకాలం: ఉ.9.00-10.30

Uday Kumar

రచయిత గురించి

Uday Kumar

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.