Rasi Phalalu Today – 22 ఆగస్టు 2025 Horoscope in Telugu
వారం – వర్జ్యం
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,శ్రావణ మాసం(Shravana Masam), దక్షిణాయణం వర్ష ఋతువు, కృష్ణపక్షం(Krishna Paksham)
Rasi Phalalu Today – 22 ఆగస్టు 2025 Horoscope in Telugu
మేష రాశి
ఈరోజు ప్రతి చిన్న విషయములో జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవడం ద్వారా అనేక సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి. దంపతుల మధ్య అనుబంధం మరింత బలపడుతుంది.
…ఇంకా చదవండి
వృషభరాశి
ఈరోజు మీరు చేపట్టే ముఖ్యమైన వ్యవహారాలలో సహోద్యోగులు, స్నేహితులు అండదండగా నిలబడతారు. వారి సహకారం వల్ల క్లిష్టమైన పనులు కూడా సులభంగా పూర్తిచేసే అవకాశం ఉంది.
…ఇంకా చదవండి
మిథున రాశి
ఈరోజు మీకు అనేకాంశాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. సన్నిహితులతో ఆనందకరమైన సమయాన్ని గడుపుతారు.
…ఇంకా చదవండి
కర్కాటక రాశి
ఈరోజు మీ మాట తీరు వలన నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇతరులతో మాట్లాడేటప్పుడు ఓర్పు, జాగ్రత్త అవసరం.
…ఇంకా చదవండి
సింహ రాశి
ఈరోజు మీరు ముఖ్యమైన దరఖాస్తు ఫారాలు, పత్రాలు చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.వాటిని జాగ్రత్తగా పరిశీలించి పూర్తి చేయడం చాలా ముఖ్యం.
…ఇంకా చదవండి
కన్యా రాశి
ఈరోజు ఆర్థికపరమైన లావాదేవీలు మీకు అనుకూలంగా ఉంటాయి. గతంలో ఎదురైన ఇబ్బందులు క్రమంగా సర్దుబాటు అవుతాయి.
…ఇంకా చదవండి
తులా రాశి
ఈరోజు నూతన పెట్టుబడుల విషయంలో తొందరపడకపోవడం మంచిది. ఆర్థిక విషయాల్లో నిదానంగా, జాగ్రత్తగా ముందుకు సాగాలి.
…ఇంకా చదవండి
వృశ్చిక రాశి
ఈరోజు వాహనాలు నడిపేటప్పుడు ప్రత్యేక జాగ్రత్తలు అవసరం. చిన్న నిర్లక్ష్యం కూడా ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంది. కాబట్టి ప్రయాణాల్లో మెలుకువలు పాటించడం శ్రేయస్కరం.
…ఇంకా చదవండి
ధనుస్సు రాశి
ఈరోజు మీరు ప్రజాసంబంధాలు పెంపొందించుకోవడానికి ప్రత్యేక శ్రద్ధ చూపుతారు. మీ మాటతీరు, ప్రవర్తన వలన కొత్త పరిచయాలు ఏర్పడి భవిష్యత్తులో ప్రయోజనాలు కలిగే అవకాశాలు ఉన్నాయి.
…ఇంకా చదవండి
మకర రాశి
కుటుంబ వ్యవహారాలలో ఈరోజు జాగ్రత్త అవసరం. ఇతరుల జోక్యం పెరిగే అవకాశం ఉండటంతో నిర్ణయాలు తీసుకునేటప్పుడు సావధానంగా ఉండండి.చిన్న చిన్న విషయాలపైనా సహనంతో స్పందించడం మంచిది. …ఇంకా చదవండి
కుంభ రాశి
వృత్తి, ఉద్యోగాల పరంగా చెప్పుకోదగిన మార్పులు లేకపోయినా, ప్రస్తుత పరిస్థితులు స్థిరంగా కొనసాగుతాయి. పనుల్లో సహచరుల సహకారం లభిస్తుంది. క్రమశిక్షణతో పని చేస్తే ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు.
…ఇంకా చదవండి
మీన రాశి
మనస్సును అదుపులో ఉంచుకోవడం ఈ రోజు అత్యంత ముఖ్యమైంది. తొందరపాటు నిర్ణయాలు తప్పులు చేయించవచ్చు కాబట్టి సహనంతో వ్యవహరించండి. ఏకాగ్రత పెంచుకుంటే పనులు సాఫీగా పూర్తవుతాయి.
…ఇంకా చదవండి