Rasi Phalalu Today – 20 ఆగస్టు 2025 Horoscope in Telugu

Read Time:  1 min
Rasi Phalalu Today – 20 ఆగస్టు 2025 Horoscope in Telugu
FONT SIZE
GET APP

Rasi Phalalu Today – 20 ఆగస్టు 2025 Horoscope in Telugu

Sun

వారం – వర్జ్యం

తేది : 20-08-2025,బుధవారం

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,శ్రావణ మాసం(Shravana Masam), దక్షిణాయణం వర్ష ఋతువు, కృష్ణపక్షం(Krishna Paksham)

ద్వాదశి మ.2.01 , పునర్వసు రా.12.29
వర్జ్యం: ఉ.8.23-9.57
దు.ము : ఉ.11.46-12.36
రాహుకాలం: మ.12.00-1.30

Rasi Phalalu Today – 20 ఆగస్టు 2025 Horoscope in Telugu

Aries

మేష రాశి

కుటుంబ సభ్యులను కలిసి ఉల్లాసంగా గడిపే అవకాశాలు వస్తాయి. పాత మిత్రుల కలయిక కూడా ఆనందాన్ని కలిగిస్తుంది. ఇంట్లో వాతావరణం అనుకూలంగా ఉండి సుఖశాంతులు నెలకొంటాయి.

…ఇంకా చదవండి
Taurus

వృషభరాశి

ముఖ్యమైన పనులు కొంచెం నిదానంగా పూర్తికావచ్చు, కానీ చివరికి అనుకున్న ఫలితాలు సాధిస్తారు. శాంతి, సహనం పాటించడం వల్ల పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొనవలసి వస్తుంది.

…ఇంకా చదవండి
Taurus

మిథున రాశి

ఈ రోజు మీకు నూతన పరిచయాలు ఏర్పడతాయి. కొత్తగా కలిసే వ్యక్తులు మీకు చేయూతనిస్తూ భవిష్యత్తులో ఉపయోగపడే అవకాశం ఉంది. స్నేహాలు, సంబంధాలు బలపడే సమయం ఇది.

…ఇంకా చదవండి
Taurus

కర్కాటక రాశి

ఈ రోజు మీరు సంఘసేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. మీ సేవా దృక్పథం, సహాయస్ఫూర్తి చుట్టుపక్కల వారికి స్ఫూర్తినిస్తుంది. సమాజంలో మీ గౌరవం, పేరు ప్రతిష్టలు పెరుగుతాయి.

…ఇంకా చదవండి
Taurus

సింహ రాశి

ఈ రోజు ఉద్యోగంలో అనుకోని చిక్కులు ఎదురవుతాయి. సహచరులు లేదా పైఅధికారులతో చిన్నపాటి విభేదాలు రావచ్చు. పనులను నిదానంగా, జాగ్రత్తగా పూర్తి చేయడం ద్వారా సమస్యలను అధిగమించగలరు.

…ఇంకా చదవండి
Taurus

కన్యా రాశి

ఈ రోజు రాజకీయ, కళారంగాలలో ఉన్నవారికి అనుకూలమైన సమయం. మీ ప్రతిభ గుర్తింపు పొందుతుంది. కొంతమందికి విదేశీ పర్యటనలు ఏర్పడే అవకాశం ఉంది.

…ఇంకా చదవండి
Taurus

తులా రాశి

ఈ రోజు పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వాటి ద్వారా భవిష్యత్తులో మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళే అవకాశాలు లభిస్తాయి. సమాజంలో మీ స్థానానికి గౌరవం పెరుగుతుంది.

…ఇంకా చదవండి
Taurus

వృశ్చిక రాశి

ఈ రోజు కుటుంబసభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. సన్నిహితులతో గడిపే సమయం మిమ్మల్ని మానసికంగా ప్రశాంతంగా ఉంచుతుంది. గృహంలో శుభ వాతావరణం నెలకొని ఉత్సాహం పెరుగుతుంది.

…ఇంకా చదవండి
Taurus

ధనుస్సు రాశి

ఈ రోజు మీకు దూరప్రాంతాలనుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడి మిమ్మల్ని ప్రోత్సహించే అవకాశాలు లభిస్తాయి. మిత్రులు, బంధువులతో సత్సంబంధాలు ఏర్పడతాయి.

…ఇంకా చదవండి
Taurus

మకర రాశి

ఈ రోజు భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వ్యాపార భాగస్వాములతో అనుకూలత ఏర్పడి కొత్త అవకాశాలు లభిస్తాయి. వృత్తి సంబంధిత కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది.

…ఇంకా చదవండి
Taurus

కుంభ రాశి

ఈ రోజు ముఖ్యమైన కార్యక్రమాలలో కొద్దిపాటి ఆటంకాలు ఎదురైనా చివరికి వాటిని అధిగమిస్తారు. మీ పట్టుదలతో పనులు సకాలంలో పూర్తవుతాయి.

…ఇంకా చదవండి
Taurus

మీన రాశి

ఈ రోజు మీకు కొన్ని కీలక వ్యవహారాలలో సన్నిహితుల సహాయం లభిస్తుంది. మీరు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం కనుగొనటంలో వారు కీలక పాత్ర పోషిస్తారు.

…ఇంకా చదవండి

Uday Kumar

రచయిత గురించి

Uday Kumar

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.