రష్మిక–విజయ్ (Rashmika-Vijay) సోషల్ మీడియాలో మళ్లీ హాట్ టాపిక్!
(Rashmika-Vijay) నేషనల్ క్రష్‌గా గుర్తింపు పొందిన రష్మిక మందన్నా, యువతలో అపారమైన ఫాలోయింగ్ ఉన్న విజయ్ దేవరకొండ మరోసారి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నారు. రష్మిక కొత్త సినిమా ‘మైసా’కి విజయ్ దేవరకొండ అభినందనలు తెలియజేయగా, ఆమె తిరిగి ఇచ్చిన స్పందన ఇప్పుడు నెట్టింట్లో హీటెక్కిస్తోంది. “విజ్జూ.. ఈ సినిమాతో నిన్ను గర్వపడేలా చేస్తానని మాటిస్తున్నా” అంటూ రష్మిక చేసిన పోస్టు, వారిద్దరి మధ్య సంబంధం పై ఎప్పటినుంచో ఉన్న ఊహాగానాలకు మరోసారి బలం ఇచ్చింది. హార్ట్ ఎమోజీ జోడించి విజయ్‌ను వ్యక్తిగతంగా ఉద్దేశిస్తూ రష్మిక స్పందించడంపై అభిమానులు ఫిదా అవుతున్నారు.
మైసా మూవీతో కొత్త ప్రయోగం
రష్మిక మందన్నా తన కెరీర్‌లో ఎన్నడూ చేయని పాత్రను పోషిస్తూ ‘మైసా’ అనే విభిన్న కథాంశంతో కూడిన సినిమాను ప్రారంభించారు. “ఇంతకుముందు అడుగుపెట్టని ప్రపంచం ఇది” అని పేర్కొంటూ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఈ పోస్టర్‌కు సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. విజయ్ దేవరకొండ కూడా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో “ఇది అద్భుతంగా ఉండనుంది” అంటూ మైసా పోస్టర్‌ను షేర్ చేశారు. ఇందుకు స్పందించిన రష్మిక, అతనిపై తన ప్రత్యేకతను మరోసారి చాటిచెప్పారు.
ప్రేమలో నిజమేనా? మరోసారి ఊహాగానాల జ్వాల
ఇంతకుముందు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా ప్రేమలో ఉన్నారని ఎన్నోసార్లు వార్తలొచ్చినా, వారు ఆ విషయాన్ని బహిరంగంగా అంగీకరించలేదు. కానీ రెగ్యులర్‌గా ఒకరి సినిమాలకు మరొకరు ప్రమోషన్ చేయడం, కలిసి ప్రయాణాలు చేయడం, ఒకే చోట విహారయాత్రలు చేయడం వల్ల వీరిద్దరి మధ్య ఉన్న బంధం పై పలు ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి. ఇటీవల కూడా వారిద్దరూ ఒకే కారులో కనిపించిన వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొట్టాయి. తాజాగా విజయ్‌ను ‘విజ్జూ’ అని పిలవడం, ప్రేమతో కూడిన పదజాలాన్ని వాడడం ఈ రూమర్లకు మరింత బలాన్ని ఇచ్చింది.
విజయ్, రష్మిక ప్రాజెక్ట్ అప్‌డేట్స్
సినిమాల విషయానికొస్తే, రష్మిక ప్రస్తుతం రెండు ముఖ్యమైన ప్రాజెక్టుల్లో నటిస్తున్నారు. రవీంద్ర పుల్లె అనే కొత్త దర్శకుడు డైరెక్ట్ చేస్తున్న ‘మైసా’లో ఆమె విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. మరోవైపు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ‘ది గర్ల్‌ఫ్రెండ్’ అనే సినిమాలో కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఇదిలా ఉంటే విజయ్ దేవరకొండ ప్రస్తుతం ‘కింగ్‌డమ్’ అనే భారీ యాక్షన్ మూవీతో బిజీగా ఉన్నారు. ఈ మూవీపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి.
Read also: Anil Ravipudi: దిల్ రాజు పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన అనిల్ రావిపూడి