సినీ ఇండస్ట్రీని షేక్‌ చేస్తున్న రష్మిక మందన్న

సినీ ఇండస్ట్రీని షేక్‌ చేస్తున్న రష్మిక మందన్న

సినీ ఇండస్ట్రీని షేక్‌ చేస్తున్న రష్మిక మందన్న నిన్నమొన్నటి వరకూ ‘నేషనల్ క్రష్’గా అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించిన రష్మిక మందన్న, ఇప్పుడు వరుస బ్లాక్‌బస్టర్ హిట్లతో ‘బాక్సాఫీస్ క్వీన్’గా మారిపోయింది.గత 16 నెలల్లో ఆమె మూడు సినిమాల్లో నటించి, ఈ భామకు వచ్చిన పాపులారిటీ భారతీయ సినిమా చరిత్రలో మరెవ్వరికీ రాలేదని చెప్పడం అతి పెద్ద ప్రశంస.రష్మిక నటించిన మూడు సినిమాలు – యానిమల్ (2023), పుష్ప 2: ది రూల్ (2024), చావా (2025) – బాక్సాఫీస్ వద్ద అద్భుతంగా వ్యాపించాయి. ఈ మూడు సినిమాలు కలిపి రూ. 3300 కోట్లకు పైగా వసూలు చేశాయి. రణబీర్ కపూర్, అల్లు అర్జున్, విక్కీ కౌశల్ వంటి అగ్ర కథానాయకులతో కలిసి ఈ సినిమాలు సూపర్ హిట్లుగా నిలిచాయి.

Advertisements
సినీ ఇండస్ట్రీని షేక్‌ చేస్తున్న రష్మిక మందన్న
సినీ ఇండస్ట్రీని షేక్‌ చేస్తున్న రష్మిక మందన్న

దీంతో రష్మికపై ప్రశంసలు కురుస్తున్నాయి.రష్మిక పాత్రల ఎంపిక, స్క్రీన్ ప్రెజెన్స్, యాక్టింగ్ స్కిల్స్ అన్ని కలిసి ఆమెను స్టార్‌డమ్‌కు తీసుకెళ్లాయి.ఈరోజుకి, రష్మిక భారతదేశం లో అత్యధిక వసూళ్లు సాధించిన హీరోయిన్‌లలో ఒకరిగా నిలిచింది.ముఖ్యంగా యానిమల్ మువీ రూ. 502.98 కోట్లను, పుష్ప 2: ది రూల్ హిందీలో రూ.812 కోట్లను వసూలు చేసింది. ప్రస్తుతం చావా ప్రపంచవ్యాప్తంగా రూ.700 కోట్ల వసూళ్లతో బాక్సాఫీస్‌ని ఊపేస్తోంది.ఈ సంవత్సరం చివరిలో రష్మిక స్టార్‌డమ్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.గతంలో ప్రియాంక చోప్రా,దీపికా పదుకొనే,ఆలియా భట్ వంటి నాయికలు బాలీవుడ్‌లో బాక్సాఫీస్‌ను ఏలితే, ఇప్పుడు రష్మిక కూడా అదే దిశలో దూసుకుపోతుంది. ఇంకా రష్మిక త్వరలో సల్మాన్ ఖాన్ తో బాలీవుడ్‌లో హిట్ మూవీ చేయబోతుంది.2025లో విడుదల కానున్న సికందర్ చిత్రంలో సల్మాన్‌తో జోడీ కడుతోంది.ఈ మూవీ ఈద్ 2025 నాటికి ప్రేక్షకుల ముందుకు రానుంది.మరోవైపు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర మరియు ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వంలో థమ అనే రెండు సినిమాల్లో కూడా రష్మిక నటించనుంది.

Related Posts
Matthew Wade;మాథ్యూ వేడ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికేశాడు?
matthew

ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియా క్రికెట్ ఆటగాడు మాథ్యూ వేడ్ అధికారికంగా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు అయితే, అతను బిగ్‌బాష్‌ లీగ్ లో హోబర్ట్ హరికేన్స్ జట్టులో Read more

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సోనూసూద్ సహాయం!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సోనూసూద్ సహాయం!

వివరాల్లోకి వెళ్ళగా నటుడు మరియు దాత సోను సూద్ మరొకసారి ఆయన సేవ హయధేయన్ని చాటుకున్నారు ఈరోజు రాష్ట్ర సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడును Read more

కాంతార 2 రిలీజ్ డేట్‌ను ప్రకటించిన రిషబ్ శెట్టి
kanthara2

కన్నడ సినీ పరిశ్రమను ఊపేసిన బ్లాక్‌బస్టర్ 'కాంతారా'తో రిషబ్ శెట్టి దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న ఈ చిత్రానికి కొనసాగింపుగా ప్రీక్వెల్‌ను ప్రకటించారు. ఈ Read more

పవన్ కల్యాణ్ పై తీవ్రంగా తప్పుబట్టిన లక్ష్మీపార్వతి
పవన్ కల్యాణ్ పై తీవ్రంగా తప్పుబట్టిన లక్ష్మీపార్వతి

ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళి అరెస్టు విషయమై ఇటీవల రాయచోటి పోలీసులు చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్ పై విమర్శలు Read more

×