హైదరాబాద్: రంగారెడ్డి (Rangareddy) జిల్లాలోని శంకర్‌పల్లి (Shankarpally) పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువతి హల్‌చల్ చేసింది. కారును ఏకంగా రైలు పట్టాలపై నడిపింది. నాగులపల్లి నుంచి శంకర్‌పల్లి వెళ్లే మార్గంలో రైలుపట్టాలపై కారు డ్రైవింగ్ చేస్తూ భయాందోళనకు గురిచేసింది. దీంతో రైళ్లను సైతం ఆపివేశారు.
రైలు పట్టాలపై కారు నడిపిన యువతీ
నాగులపల్లిలో యువతి కారును గమనించిన స్థానికులు అడ్డగించారు. సరిగ్గా ఇదే సమయంలో పట్టాలపై కారును గమనించిన లోకోపైలట్ రైలును ఆపేశారు. యువతి నిర్వాకంతో గంటల తరబడి రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. దీంతో ఆ మార్గంలో నడిచే రైళ్లు గంటలతరబడి నిలిచిపోయాయి.శంకర్‌పల్లి పోలీసులు యువతి వికారాబాద్ రైల్వే పోలీసులకు అప్పగించనున్నారు. అయితే, ఆమె మద్యం లేదా డ్రగ్స్ తీసుకుందా ..? లేదా..? అనే వివరాలు మాత్రం ఇంకా తెలియరాలేదు.. ఏదైనా మానసిక సమస్యలతో బాధపడుతుండొచ్చని పేర్కొంటున్నారు..
యువతికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..
Read also: Jupally Krishna Rao: పర్యాటక రంగ అభివృద్ధికి ప్రణాళికలు: మంత్రి జూపల్లి కృష్ణారావు
Telangana: రాష్ట్రంలో భారీగా భూ సమస్యలు,8 లక్షలకు పైగా దరఖాస్తులు