Ramesh Bidhuri should be suspended.. Seethakka demands

రమేష్ బిధూరిని సస్పెండ్ చేయాలి: సీతక్క డిమాండ్

హైదరాబాద్‌: కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీపై దారుణ వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో బరిలో నిలిచిన రమేష్ బిధూరిపై తెలంగాణ మంత్రి సీతక్క మండిపడ్డారు. ప్రియాంకా గాంధీ మీద బీజేపీ నేత చేసిన అనుచిత వ్యాఖ్యల్ని ఆమె తీవ్రంగా ఖండించారు. ర‌మేష్ బిధూరి వ్యాఖ్య‌లు మ‌హిళా లోకానికే అవ‌మానక‌రం, ప్రతి ఒక్కరూ బీజేపీ నేత వ్యాఖ్యల్ని ఖండించాలని పిలుపునిచ్చారు. ఓ మహిళా ఎంపీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రమేష్ బిధూరి బేషరతుగా క్ష‌మాప‌ణ‌లు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రియాంక గాంధీపై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన బీజేపీ నేతను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలన్నారు.

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రమేష్ బిధూరి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను కనక గెలిపిస్తే కల్కాజీలోని రోడ్లను ప్రియాంక గాంధీ చెంపల లాగ నున్నగా మారుస్తానని చెప్పడంతో వివాదం మొదలైంది. తాను చేసింది అని భావిస్తే.. ముందుగా లాలూ ప్రసాద్ యాదవ్ చేసిన వ్యాఖ్యలకు ఆయన, కాంగ్రెస్ పార్టీ నేతలు క్షమాపణ చెప్పాలన్నారు.ఓక వీడియోలో, రమేష్ బిధురి మాట్లాడుతూ, ‘బిహార్ రోడ్లను హేమమాలిని చెంపల్లాగ అందంగా చేస్తానని గతంలో లాలూ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఆర్జేడీ నేత అప్పట్లో చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెబితే.. తాను కూడా ప్రియాంక గాంధీకి సారీ చెబుతా అన్నారు. కాంగ్రెస్ పార్టీలోని వారే మహిళలా, వారికే ఆత్మగౌరవం ఉంటుందా.. బీజేపీ మహిళా నేతలకు ఆత్మ గౌరవం, విలువ ఉండవా అని ఎదురు ప్రశ్నించడంతో కాంగ్రెస్ నేతలు కంగుతిన్నారు.

Related Posts
నవంబర్ 25 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం..!
Winter session of Parliament will start from November 25

న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్‌ 25 నుండి డిసెంబర్‌ 20 వరకు కొనసాగనున్నాయి. ఈ సందర్భంగా పలు కీలక బిల్లులపై చర్చ జరగనుంది. నవంబర్ 26న, Read more

బ్రిక్స్ సదస్సు ..నేడు ప్రధాని మోడీ, షీ జిన్‌పింగ్ మధ్య ద్వైపాక్షిక సమావేశం
PM Modi Speaks On The India Century At NDTV World Summit

న్యూఢిల్లీ : కజాన్ నగరంలో బ్రిక్స్ సదస్సు కోసం భారత ప్రధాని నరేంద్ర మోడీ రష్యాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు ప్రధాని మోడీ Read more

Vishnupriya: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో విచారణకు హాజరు విష్ణుప్రియ
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో విచారణకు హాజరు విష్ణుప్రియ

బుల్లితెర యాంకర్ విష్ణుప్రియ గురువారం ఉదయం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. తన అడ్వొకేట్ తో కలిసి ఉదయం పది గంటల ప్రాంతంలో స్టేషన్ కు Read more

తల్లిదండ్రులు చనిపోయిన చిన్నారులకు పెన్షన్
New law in AP soon: CM Chandrababu

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీలో తల్లిదండ్రులు చనిపోయి చిన్నారులు ఉంటే వారికీ పెన్షన్ ఇవ్వాలని అధికారులకు సూచించారు. దివ్యాంగులు చాలా మంది 15 వేలు పెన్షన్ అడుగుతున్నారని…అందులో Read more