Ram Gopal Varma attended the police investigation

పోలీసుల విచారణకు హాజరైన రాంగోపాల్‌ వర్మ..

ఒంగోలు : ఫొటోల మార్ఫింగ్ కేసులో ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ పోలీసుల విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. ఈ మేరకు ఆయన్ను ఒంగోలు రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో సీఐ శ్రీకాంత్‌బాబు విచారిస్తున్నారు. చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్, నారా లోకేశ్ ఫొటోల‌ను మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్య‌మాల్లో పోస్ట్ చేశారనే ఆరోపణలతో ఆయ‌న‌పై కేసు న‌మోదైంది. ఈ కేసులో విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని పోలీసులు నోటీసులు ఇవ్వడంతో ఒంగోలు రూర‌ల్ పోలీస్ స్టేష‌న్‌లో ఈరోజు ఆర్‌జీవీ విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. న్యాయ‌వాది స‌మ‌క్షంలో వ‌ర్మ విచార‌ణ కొనసాగుతుంది.

image

గత నవంబర్ లో మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో వర్మపై కేసు నమోదు అయ్యింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ ఫోటోలు మార్ఫింగ్ చేసి పోస్ట్ చేయడంపై టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణకు హాజరు కావాలని వర్మకు నోటీసులు ఇచ్చారు. అయితే, నవంబర్ 19, 25న విచారణకు ఆర్జీవీ గైర్హాజరయ్యారు. ఆ తర్వాత హైకోర్టుకెళ్ళి.. అరెస్ట్ కాకుండా ముందస్తు బెయిల్ తెచ్చుకున్నాడు. అయితే, పోలీసుల విచారణకు సహకరించాలని వర్మను హైకోర్టు ఆదేశించింది.

ఈ కేసు విచారణలో భాగంగా పోలీసులు గతంలో నోటీసులు ఇచ్చినా ఆర్జీవీ గైర్హాజరయ్యారు. తాను సినిమా చిత్రీకరణలో నిమగ్నమై ఉన్నాననీ, వేరొక రోజు వస్తానని వాట్సప్‌ ద్వారా సమాచారం పంపారు. పోలీసుల అనుమతి లేకుండానే విచారణకు గైర్హాజరయ్యారు. దీంతో ఆయన్ను అరెస్టు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగగా.. కొన్నాళ్లపాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అదే సమయంలో తనపై పోలీసులు అన్యాయంగా, అక్రమంగా కేసు నమోదు చేశారని, సదరు ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలంటూ హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. వర్మకు బెయిల్‌ మంజూరు చేసిన ఉన్నత న్యాయస్థానం.. పోలీసు విచారణకు హాజరై వారికి సహకరించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఒంగోలు రూరల్‌ పోలీసుల ఇటీవల మరోసారి నోటీసులు పంపారు. దీంతో నేడు వర్మ విచారణకు హాజరయ్యారు.

Related Posts
రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ – నిధులు, ప్రాజెక్టులపై చర్చ
CM Revanth condemns attacks on houses of film personalities (1)

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో ఆయనతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా హస్తినకు Read more

అల్లు అర్జున్ దాడి: రేవంత్ రెడ్డితో నిందితుడి లింక్?
అల్లు అర్జున్ దాడి: రేవంత్ రెడ్డితో నిందితుడి లింక్?

అల్లు అర్జున్ ఇంటిపై దాడి: నిందితులకు బెయిల్, రేవంత్ తో లింక్ నటుడు అల్లు అర్జున్‌ ఇంటిపై దాడి కేసులో బెయిల్‌ పొందిన ఆరుగురు నిందితుల్లో ఒకరు Read more

రైతుల హక్కుల కోసం విజయ
రైతుల హక్కుల కోసం విజయ

ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి వ్యతిరేకంగా గత ఒక సంవత్సరం నుంచి రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెల్సిందే. ఈ ఆందోళనలలో భాగంగా రైతుల సమస్యలకు మద్దతు తెలిపిన Read more

కాసేపట్లో ఢిల్లీకి సీఎం రేవంత్
cm revanth

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం దిల్లీకి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో ఆయనతో పాటు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కూడా హాజరుకానున్నారు. రాష్ట్ర Read more