గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న భారీ చిత్రం “పెద్ది”పై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.ఈ సినిమాకు యూత్‌ఫుల్ డైరెక్టర్ సానా బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తుండగా, మ్యూజిక్ మాయాజాలంతో మనల్ని మంత్రముగ్దులను చేసే ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు.ఈ కాంబినేషన్‌నే చూసి అభిమానులు సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.ఇప్పటికే షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా నుంచి తాజాగా ఓ ఆసక్తికర అప్‌డేట్ బయటకు వచ్చింది. సినిమా నుంచి ఫస్ట్ షాట్ గ్లింప్స్ వీడియోను ఏప్రిల్ 6 ఉదయం 11.45 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.ఈ వీడియోకు సంబంధించి రామ్ చరణ్ స్వయంగా ఒక మ్యూజిక్ బిట్‌ను అభిమానులతో పంచుకున్నారు.”పెద్ది .అంటూ సాగిన ఈ మ్యూజిక్ స్నిపెట్ సామాజిక మాధ్యమాల్లో ఫుల్ ట్రెండ్ అవుతోంది.రామ్ చరణ్ తన అధికారిక సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ, “పెద్ది గ్లింప్స్ చూశాక గుండె నిండిపోయింది. ఆ ఫీలింగ్‌ను మాటల్లో చెప్పలేను.రెహ్మాన్ గారు కంపోజ్ చేసిన మ్యూజిక్ విన్నప్పుడే గూస్‌బంప్స్ వచ్చాయి. అదరహో అనిపించేలా ఉంది.

మీరు కూడా తప్పకుండా ఈ వీడియోను ఇష్టపడతారు. రేపు ఉదయం 11.45కి గ్లింప్స్ వస్తోంది… మిస్ అవ్వద్దు!” అని రాసుకొచ్చారు.ఈ పోస్టుతోపాటు ఆయన షేర్ చేసిన మ్యూజిక్ బిట్‌లో “పెద్ది పెద్ది…” అనే పదాలు ఓ పవర్‌ఫుల్ మాస్ ఫీల్‌తో వినిపించాయి. ఈ బిట్ వింటే గుండెల్లో ఊపొస్తుంది. రెహ్మాన్ మ్యూజిక్‌లో రా మాస్ టచ్ అదిరిపోతుందనే చెప్పాలి. ఇప్పటికే ఈ బిట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చరణ్ లుక్స్, స్క్రీన్ ప్రెజెన్స్ చూసి ఫ్యాన్స్ అంతా ఓ రేంజ్‌లో హైలో ఉన్నారు.ఇదిలా ఉండగా, ఈ చిత్రంలో రామ్ చరణ్ లుక్, పాత్ర, కథ గురించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక వివరాలు బయటకు రాలేదు. కానీ చిత్రబృందం మాత్రం ఓ మాస్ అండ్ ఎమోషనల్ డ్రామా సెట్ చేయబోతుందనే సంకేతాలు ఇచ్చింది. రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగనున్న ఈ కథలో చరణ్ పూర్తిగా కొత్తగా కనిపించబోతున్నాడని సమాచారం.
ఇప్పటికే షూటింగ్‌లో ఆయన లుక్ చూసిన వాళ్లు భారీగా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. రామ్ చరణ్ కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచేలా ఈ సినిమా ఉంటుందనే నమ్మకంతో టీం ముందుకు సాగుతోంది. ఫ్యాన్స్‌కి కావాల్సింది కూడా అదే.అదిరిపోయే మాస్ ట్రీట్. ఈ గ్లింప్స్ చూస్తే సినిమా మీద నమ్మకం మరింత పెరుగుతుందనడంలో సందేహం లేదు.ఇంకా ఈ చిత్రానికి సంబంధించిన ఇతర కాస్టింగ్ డీటెయిల్స్, రిలీజ్ డేట్, ట్రైలర్ లాంచ్ తదితర అంశాలపై త్వరలోనే చిత్ర బృందం స్పష్టత ఇవ్వనుంది. ఇప్పట్లో గ్లింప్స్‌తోనే అభిమానుల్లో జోష్ పెంచనున్న ఈ సినిమా మీద మరిన్ని అప్‌డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.