Rajini should recover soon.CM Stalin on Rajinikanth health

రజనీ త్వరగా కోలుకోవాలి..రజనీకాంత్‌ ఆరోగ్యంపై సీఎం స్టాలిన్‌

Rajini should recover soon..CM Stalin on Rajinikanth health

న్యూఢిల్లీ: సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ప్రస్తుతం చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో రజనీకాంత్‌ ఆరోగ్యంపై పలువురు ప్రముఖులు స్పందిస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలంటూ పోస్టులు పెడుతున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ సైతం రజనీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ‘ఆసుపత్రిలో చేరిన నా స్నేహితుడు రజనీకాంత్‌ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను’ అంటూ ఎక్స్‌ వేదికగా పోస్టు పెట్టారు. అదే సమయంలో, ఆ రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి కూడా నటుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

రజనీకాంత్‌ తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతున్నారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను చెన్నైలోని అపోలో దవాఖానకు తరలించారు. కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ సాయి సతీశ్‌ ఆధ్వర్యంలోని ప్రత్యేక వైద్యుల బృందం సూపర్‌స్టార్‌కు చికిత్స అందిస్తున్నదని హాస్పిటల్‌ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నదని వైద్యులు తెలిపారు.

కాగా, గతంలో కూడా రజనీకాంత్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 2020 డిసెంబర్‌లో హైదరాబాద్‌లో ఓ సినిమా షూటింగ్‌లో పాల్గొన్న సూపర్‌స్టార్‌.. రక్తపోటులో తీవ్ర హెచ్చుతగ్గులు రావడంతో జూబ్లీహిల్స్‌ అపోలో దవాఖానలో చేరారు. ప్రత్యేక ఐసీయూకు తరలించి రక్తపోటులో హెచ్చుతగ్గులను నియంత్రించారు.

Related Posts
తెలంగాణ ప్రభుత్వానికి బండి సంజయ్ వార్నింగ్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ హెచ్చరికలు జారీ చేశారు. సంక్రాంతి పండుగకు ముందు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. Read more

హరియాణా ఫలితాలపై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు
Congress complains to EC on

హరియాణా ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తామన్న విశ్వాసంతో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఈ ఫలితాలు పెద్ద Read more

ఢిల్లీ ఎన్నికలకు బీజేపీ మేనిఫెస్టో కీలక వాగ్దానాలు
ఢిల్లీ ఎన్నికలకు బీజేపీ మేనిఫెస్టో కీలక వాగ్దానాలు

ఫిబ్రవరి 5న జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ చివరి మేనిఫెస్టోని శనివారం జరిగిన బహిరంగ సభలో అమిత్ షా విడుదల చేసారు. బీజేపీ అధికారంలోకి Read more

రతన్ టాటా జీవితానికి సంబంధించిన ఈ 10 వాస్తవాలు మీకు తెలుసా?
ratan tata.jpg

రతన్ టాటా, భారత పారిశ్రామిక రంగంలో ఒక ప్రఖ్యాత వ్యక్తిగా, విశేషమైన కీర్తి పొందారు. టాటా గ్రూప్‌కు తన నేతృత్వంలో ఎంతో కీలకమైన మార్పులు తీసుకువచ్చి, దాతృత్వానికి, Read more