हिन्दी | Epaper
ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

Rajamouli: చిన్న సినిమాలే సమాజాన్ని ప్రతిబింబిస్తున్నాయన్న రాజమౌళి

Ramya
Rajamouli: చిన్న సినిమాలే సమాజాన్ని ప్రతిబింబిస్తున్నాయన్న రాజమౌళి

ఇక ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి ప్రశంసలతో తమిళ ఇండస్ట్రీ దద్దరిల్లింది!

తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఓ చిన్న తమిళ చిత్రం.. కానీ అందులోని భావోద్వేగం, హాస్యం, కథన శైలి ఎంతో మందిని ఆకట్టుకుంటోంది. ఈ సినిమానే ‘టూరిస్ట్ ఫ్యామిలీ’. అబిషన్ జీవింత్ అనే యువ దర్శకుడు తెరపైకి తీసుకొచ్చిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా, భారత సినిమా పరిశ్రమను అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేలా చేసిన దర్శక దిగ్గజం ఎస్‌.ఎస్‌. రాజమౌళి ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించడంతో సినిమా టీమ్ ఆనందంలో మునిగిపోయింది.

జక్కన్న ఫీడ్‌బ్యాక్‌తో చిత్రబృందం ఉత్సాహంగా

రాజమౌళి తన ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ ద్వారా ఈ చిత్రంపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. “అద్భుతమైన సినిమా ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ చూశాను. మనసును హత్తుకునేలా, కడుపుబ్బా నవ్వించే హాస్యంతో నిండి ఉంది. ఆరంభం నుంచి చివరి వరకూ నన్ను ఆసక్తిగా ఉంచింది. గొప్ప రచన, గొప్ప దర్శకత్వం — అబిషన్ జీవింత్ గారిది. ఇటీవలి సంవత్సరాల్లో నాకు లభించిన ఉత్తమ సినిమాటిక్ అనుభవానికి ధన్యవాదాలు” అని జక్కన్న పేర్కొన్నారు.

ఈ వాక్యాలే చిత్రబృందానికి వందల కోట్లు విలువైనవిగా మారాయి. రాజమౌళి వంటి దర్శకుడి నుంచి అంగీకారం రావడం అంటే, అది మామూలు విషయం కాదు. ఈ ప్రశంసలతో దర్శకుడు అబిషన్ జీవింత్ నిజంగానే ఆనందంతో ఊగిపోయారు.

SS Rajamouli
SS Rajamouli

దర్శకుడి స్పందన : కలలే నిజమయ్యాయి!

రాజమౌళి ట్వీట్‌ను చూసిన వెంటనే అబిషన్, రాజమౌళి ట్వీట్‌కు బదులిస్తూ, “చాలా ధన్యవాదాలు, రాజమౌళి సర్! మీ ట్వీట్ మాకు గొప్ప ఆశ్చర్యాన్ని కలిగించింది, ఇది నిజంగా మా రోజును మరింత ప్రత్యేకంగా మార్చింది. మాటలకు అందని కృతజ్ఞతలు” అని తెలిపారు. అంతేకాకుండా, “ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను.. ఆయన సినిమాలను ఎంతో ఆసక్తిగా చూసేవాడిని, కానీ ఒకరోజు ఆ అద్భుత ప్రపంచాలను సృష్టించిన వ్యక్తి నా పేరును ప్రస్తావిస్తారని ఎప్పుడూ ఊహించలేదు. రాజమౌళి సర్, మీరు ఈ కుర్రాడి కలను జీవితానికంటే పెద్దదిగా చేశారు” అంటూ తన అనుచరులతో ఆనందాన్ని పంచుకున్నారు.

బాక్సాఫీస్ వద్ద విజయ గర్జన – పెద్ద సినిమాలకు పోటీగా చిన్న సినిమా

మే 1న విడుదలైన ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ చిత్రం తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కింది. సూర్య నటించిన ‘రెట్రో’, నాని ‘హిట్: ది థర్డ్ కేస్’ వంటి పెద్ద సినిమాలతో పాటు విడుదలైనప్పటికీ, ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇప్పటికే రూ.50 కోట్లకు పైగా స్థూల వసూళ్లను సాధించింది. రాజమౌళి కంటే ముందు సూపర్ స్టార్ రజినీకాంత్, నటుడు ధనుష్ వంటి ప్రముఖులు కూడా ఈ చిత్రాన్ని, దర్శకుడిని అభినందించారు.

రజినీకాంత్, ధనుష్ నుండి కూడా ప్రశంసలు!

రాజమౌళి ముందు ఈ చిత్రాన్ని మెచ్చిన ప్రముఖుల్లో సూపర్ స్టార్ రజినీకాంత్ మరియు నటుడు ధనుష్ కూడా ఉన్నారు. సినిమాపై ప్రీతిని వ్యక్తం చేసిన ఈ ఇద్దరు స్టార్‌లు, దర్శకుడిని అభినందిస్తూ ట్వీట్లు చేశారు. దీంతో, ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ చిత్రం సాధించిన గౌరవం మరింత పెరిగింది.

శశికుమార్, సిమ్రాన్ మళ్లీ మేజిక్ చేశారు

ఈ చిత్రంలో శశికుమార్ మరియు సిమ్రాన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇద్దరూ తమ న‌ట‌న‌తో ప్రేక్షకుల మనసు దోచుకున్నారు. అలాగే యోగి బాబు, మిథున్ జయశంకర్, కమలేష్, ఎం.ఎస్. భాస్కర్ లాంటి నటులు తమ పాత్రల్లో నటన పరంగా ప్రభావాన్ని చూపించారు. మిలియన్ డాలర్ స్టూడియోస్, ఎంఆర్‌పి ఎంటర్‌టైన్‌మెంట్ పతకాలపై ఈ చిత్రాన్ని నస్రెత్ బస్లియన్, మహేష్ రాజ్ బస్లియన్, యువరాజ్ గణేశన్ నిర్మించారు.

సినిమాటోగ్రఫీ విభాగంలో అరవింద్ విశ్వనాథన్ విశేషంగా రాణించగా, సంగీత దర్శకుడు షాన్ రెహమాన్ అందించిన నేపథ్య సంగీతం ప్రేక్షకులలో భావోద్వేగాన్ని రేకెత్తించిందని విమర్శకులు అంటున్నారు.

read also: Hit 3 OTT : త్వరలో ఓటీటీలో నాని హిట్-3 సినిమా : ఎపుడంటే

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870