చాలాకాలంగా సినిమా రంగంలో స్టంట్ మాస్టర్స్, ఫైట్ కొరియోగ్రాఫర్లు, స్టంట్‌మెన్ వారు చేస్తోన్న కష్టానికి గౌరవం లభించదనే అభిప్రాయం వినిపిస్తూ ఉండేది. అయితే ఇప్పుడు, ఏకంగా ఆస్కార్ అవార్డులలో కొత్త కేటగిరీ రాబోతుంది. ఈ విషయాన్ని అకాడమీ తాజాగా ప్రకటించింది. ‘స్టంట్ డిజైన్’ కేటగిరీలో కూడా ఇకపై అవార్డులు ఇవ్వనున్నట్లు అకాడమీ అధికారికంగా వెల్లడించింది. 2028 100వ ఆస్కార్ అవార్డులలో ఈ కేటగిరీ ఎంట్రీ ఇవ్వబోతుండగా 2027 నుంచి విడుదల కానున్న చిత్రాలను ఈ జాబితాలో ఎంపిక చేసి అవార్డులు ఇవ్వబోతున్నట్లు ప్రకటించింది.
అరుదైన ఘనత
ఆర్ఆర్ఆర్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన ఆ మూవీ ఎన్నో ఏళ్లగా తెలుగు సినిమా ఎదురుచూస్తున్న ఆస్కార్ కలను నిజం చేసింది. లాస్ ఏంజిల్స్ వేదికగా జరిగిన 95వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో ఈ చిత్రం లోని ‘నాటు నాటు’ పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఉత్తమ పాటగా అవార్డును సొంతం చేసుకుంది. ఆస్కార్ తో పాటు గోల్డెన్ గ్లోబ్, సినీ క్రిటిక్స్ అవార్డులను సొంతం చేసుకున్న ఈ సినిమాపై హాలీవుడ్ దిగ్గజాలు జేమ్స్ కామెరూన్, స్పీల్ బర్గ్ ప్రశంసల వర్షం కురిపించారు.తాజాగా ఈ చిత్రం మరో అరుదైన ఘనత సాధించింది. సినీ రంగంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డుల్లో ఆస్కార్ అగ్ర స్థానంలో ఉంది అనడంలో సందేహమే లేదు. ప్రతి నటుడు ఒక్కసారైన ఆస్కార్ అవార్డును గెలుచుకోవాలని కోరుకుంటారు. ఇప్పుడు ఈ అకాడమి అవార్డుల్లో తాజాగా కొత్త కేటగిరీ చేరనుంది. ఇకపై స్టంట్ డిజైన్ క్యాటగిరి లోను ఆస్కార్ అవార్డును ఇవ్వనున్నట్టు అకాడమీ ప్రకటించింది. 2027 నుంచి విడుదలైన సినిమాలను ఎంపిక చేసి ఈ జాబితాలో అవార్డులు ఇవ్వనున్నట్టు వెల్లడించింది.ఈ నేపథ్యం లోఆస్కార్ విన్నింగ్ మూవీ ఆర్ఆర్ఆర్ సినిమా పోస్టర్‌ను పంచుకుంది.
రాజమౌళి స్పందన
అయితే ఆస్కార్ అవార్డులలో కొత్త కేటగిరీ ప్రవేశపెట్టడంపై దిగ్గజ దర్శకుడు రాజమౌళి స్పందించాడు.100 ఏండ్ల నిరీక్షణ ఫలించింది. 2027 నుంచి విడుదలయ్యే సినిమాలకు స్టంట్ డిజైన్‌లో అవార్డులు రానున్నాయి. ఈ చారిత్రాత్మక గుర్తింపును సాధ్యం చేసినందుకు డేవిడ్ లీచ్, క్రిస్ ఓ’హారాలకు అలాగే స్టంట్ కమ్యూనిటీని, స్టంట్ పని శక్తిని గౌరవించినందుకు ది అకాడమీ, సిఈఓ బిల్ క్రామెర్, ప్రెసిడెంట్ జానెట్ యాంగ్‌లకు హృదయపూర్వక ధన్యవాదాలు. అని రాజమౌళి రాసుకోచ్చాడు. అలాగే పోస్టర్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రం నుంచి విజువల్ చూసి ఎంతో సంతోషమేసినట్లు తెలిపారు.
Read Also: Tamanna: రైడ్ 2 మూవీ ప్రత్యేక గీతంలో నటిస్తున్న తమన్నా