ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ ఏడాది ఫస్టియర్ మరియు సెకండియర్ ఫలితాలు ఏప్రిల్ 12 (శనివారం) ఉదయం 11 గంటలకు విడుదల చేయబోతున్నట్లు రాష్ట్ర విద్య మరియు ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ అధికారికంగా ప్రకటించారు. దీంతో, రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది.

నారా లోకేశ్ ప్రకటన
శుక్రవారం నాడు మంత్రివర్యులు మీడియాతో మాట్లాడారు. ఇంటర్మీడియట్ ఫలితాలను ఏప్రిల్ 12న ఉదయం 11 గంటలకు విడుదల చేస్తాం. ఒకేసారి ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్ ఫలితాలను ప్రకటించబోతున్నాం, అని తెలిపారు. ఈ ప్రకటనతో విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యాసంస్థల ప్రతినిధులు ఎదురుచూపులు ముగిశాయి. ఆధికారిక వెబ్‌సైట్ ద్వారా ఫలితాలు పొందవచ్చు- https://resultsbie.ap.gov.in అంతేకాదు, ఫలితాలను తెలుసుకునే మరొక సులభమైన మార్గం కూడా ఉంది. మీ మొబైల్ ఫోన్‌లో హాయ్ అని మెసేజ్‌ను మన మిత్ర నంబర్ 9552300009కు పంపితే, వెంటనే మీ ఫలితాన్ని పొందవచ్చు. ఇది విద్యార్థులకు అత్యంత ఉపయోగకరమైన డిజిటల్ సౌకర్యం. ఈసారి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 10 లక్షలకుపైగా విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరయ్యారు. అందులోనూ ప్రథమ సంవత్సరం, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు కలిపి పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఈ పరీక్షలు విద్యార్థుల భవిష్యత్‌కు కీలకం కావడంతో ఫలితాలపై ఆసక్తి, ఉత్కంఠ ఇంకా పెరిగింది. ప్రవేశ పరీక్షలు, డిగ్రీ కోర్సులు మొదలగు తదుపరి విద్యా అవకాశాలపై ఈ ఫలితాల ప్రభావం ఉంటుంది.
వాట్సాప్ ద్వారా..
ఏపీ వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ 9552300009కు హాయ్ అని మెసేజ్ పెట్టాలి.
సెలెక్ట్ సర్వీస్ లో విద్యా సేవలు ఆప్షన్ ను ఎంచుకోవాలి.
డౌన్ లోడ్ ఏపీ ఇంటర్ ఫలితాలు 2025ను ఎంచుకోవాలి.
హాట్ టికెట్ నెంబర్ ను ఎంటర్ చేసి మెమో డౌన్ లోడ్ చేసుకోవచ్చు.