పాన్-ఇండియా బ్లాక్‌బస్టర్ అయిన ఆర్ఆర్ఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా విజయం ప్రపంచ స్థాయిలో హంగామా చేసిందంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు అందరిలో ఆసక్తి రేపుతోంది – “ఆర్ఆర్ఆర్ 2 వస్తుందా?”ఈ ప్రశ్నపై ఇప్పటికే దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి కొన్ని సార్లు స్పందించారు. కానీ తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో, ఆయన స్పష్టమైన సమాధానం ఇచ్చారు. అదే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియోలో రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ కలిసి రాజమౌళిని సరదాగా ఆటపట్టించారు. వారిద్దరూ కలిసి “సర్, ఆర్ఆర్ఆర్ 2 ఎప్పుడెప్పుడు?” అని హాస్యంగా అడిగారు. దీనిపై Rajamouli నవ్వుతూ, “తప్పకుండా చేస్తాం,” అని సమాధానం ఇచ్చారు. అభిమానులు ఈ క్లిప్‌ని తెగ షేర్ చేస్తున్నారు.

లండన్ వేదికగా గ్రాండ్ లైవ్ కాన్సర్ట్
ఈ సరదా సంభాషణ లండన్‌లోని రాయల్ ఆల్బర్ట్ హాల్ వేదికగా జరిగిన RRR లైవ్ మ్యూజికల్ ఈవెంట్ సమయంలో చోటుచేసుకుంది. ఈ కార్యక్రమానికి రాజమౌళితో పాటు రామ్ చరణ్, ఎన్టీఆర్, సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి తదితరులు హాజరయ్యారు. ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించిన పాటలు అక్కడ లైవ్‌లో ప్రదర్శించగా, ప్రేక్షకులు తహతహలాడేలా ఎంజాయ్ చేశారు.
అభిమానుల మద్ధతుతో మరో ఘన విజయం?
రాజమౌళి మాటలతో అభిమానుల్లో మరోసారి RRR సీక్వెల్ మీద ఉత్కంఠ పెరిగింది. “తప్పకుండా చేస్తాం” అన్న మాటలు కొందరిలో నమ్మకాన్ని, మరికొందరిలో అంచనాలను పెంచాయి. ఇప్పటికే RRR సినిమాను ఆస్కార్ వరకు తీసుకెళ్లిన జట్టే కాబట్టి, రెండో భాగంపై అంచనాలు సహజంగానే భారీగా ఉన్నాయి.
చరణ్ – తారక్ కిమిస్ట్రీ మళ్లీ చూపించనుందా?
చరణ్, తారక్ కలిసి తెరపై చూపిన అద్భుతమైన కిమిస్ట్రీ RRR విజయం వెనక ఓ ప్రధాన కారణం. వీరిద్దరిని మళ్లీ కలిసి చూడాలన్న ఆసక్తి ప్రతి అభిమానిలో ఉంది. రాజమౌళి దర్శకత్వం మరోసారి అద్భుతంగా ఉంటుందని నమ్మకం కూడా ఉంది.
Read Also : Urvashi Rautela : కేన్స్ లో ఐశ్వర్య లుక్ ను ఊర్వశి రౌతేలా కాపీ