the rajasab 290724 3

Raja Saab: ‘రాజాసాబ్’ నుంచి క్రేజీ అప్‌డేట్‌… మెస్మ‌రైజింగ్ లుక్‌తో అద‌ర‌గొట్టిన‌ డార్లింగ్!

రెబల్‌ స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి కాంబినేషన్‌లో రూపొందుతున్న కొత్త సినిమా ‘ది రాజాసాబ్’ ఈ మధ్య కాలంలో తెలుగు సినీ ప్రక్షకుల్లో ఎంతో ఆసక్తి రేపుతోంది ఈ చిత్రం కామెడీ హర్రర్ థ్రిల్లర్ అంశాలను మిళితం చేసుకుని విభిన్నమైన కథనంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది సినిమా ప్రారంభం నుండి ప్రతీ అప్‌డేట్ అభిమానులను ఆకట్టుకుంటుండగా ఇటీవల విడుదలైన పోస్టర్‌లు గ్లింప్స్ మరింత ఉత్కంఠ పెంచాయి ప్రభాస్ పుట్టినరోజు (అక్టోబర్ 23) సందర్భంగా సినిమా మేకర్స్ అభిమానులకు ప్రత్యేక ట్రీట్‌ ఇవ్వబోతున్నారు అయితే పుట్టినరోజు రోజుకు రెండు రోజుల ముందుగానే కొత్త పోస్టర్‌ను విడుదల చేయడం విశేషం ఈ పోస్టర్‌లో ప్రభాస్ మెస్మరైజ్ చేసే లుక్‌ ప్రేక్షకులను ఆకట్టుకోగా అక్టోబర్ 23న ప్రత్యేక టీజర్ రానుందని ప్రకటించారు ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisements

ఈ చిత్రంలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్ మాళవిక మోహనన్ కథానాయికలుగా నటిస్తున్న సంగతి తెలిసిందే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మాణంలో రూపొందుతోన్న ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు 2025 వేసవి సందర్భంగా ఏప్రిల్ 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఇక ప్రభాస్ కెరీర్ విషయానికి వస్తే, ఇటీవల ‘సలార్’ ‘కల్కి 2898’ లాంటి వరుస బ్లాక్‌బస్టర్‌లతో సక్సెస్ ట్రాక్‌లో నడుస్తున్నారు ‘బాహుబలి’ సిరీస్‌ తరువాత కొన్ని ప్లాప్‌లను ఎదుర్కొన్నప్పటికీ ప్రభాస్ ప్రస్తుతం తన కెరీర్‌కి కొత్త గ్లోరీని తెచ్చుకుంటున్నారు ‘ది రాజాసాబ్’ తో ఆయన మరింత పాన్ ఇండియా రేంజ్‌లో మరో భారీ హిట్‌ అందుకునేందుకు సిద్ధమవుతున్నారు.

Related Posts
నేను సింగిల్ అని చెప్పానా అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చింది
keerthi suresh

ఇటీవల హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లి గురించి అనేక రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆమె ఓ కమెడియన్‌ను వివాహం చేసుకుందని, లేదా ఒక ప్రముఖ నిర్మాతతో పెళ్లి Read more

ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చిన సత్యదేవ్ థ్రిల్లర్ చిత్రం..
Zebra OTT

యంగ్ హీరో సత్యదేవ్ నటించిన జీబ్రా సినిమా ఇప్పుడు పూర్తిస్థాయిలో ఓటీటీ స్ట్రీమింగ్ అందుబాటులోకి వచ్చింది. నవంబర్ 22న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ Read more

Rajendra Prasad: వార్నర్‌పై రాజేంద్ర ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు
Rajendra Prasad: వార్నర్‌పై రాజేంద్ర ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు

టాలీవుడ్ లో నితిన్ కొత్త ఎంటర్‌టైనర్ టాలీవుడ్ యువ హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'రాబిన్‌హుడ్'. ఈ సినిమాను ప్రముఖ Read more

రజినీకాంత్ దగ్గరున్న ఖరీదైన వస్తువులు ఇవే..
rajinikanth

సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు వేడుకలు: అభిమానులు, సెలబ్రిటీల నుంచి ప్రేమ వెల్లువ సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా అభిమానులు, సినీ ప్రముఖులు Read more

×