Telangana rains తెలుగు రాష్ట్రాల్లో వర్షాల బీభత్సం మళ్లీ చెలరేగే సూచనలు కనిపిస్తున్నాయి. భారత వాతావరణ శాఖ (IMD) తాజా ప్రకటన ప్రకారం, ఆగస్టు 13 నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది.ఇది వాయవ్య మరియు పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో సృష్టి కానుంది. దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్రం అంతటా భారీ వర్షాలు (Rains) కురిసే అవకాశముంది.ఈ విషయమై రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ స్పందించారు.హైదరాబాద్‌లోని పశ్చిమ భాగాల్లో ట్రాఫిక్‌కు ఇబ్బందులు తలెత్తొచ్చు. కార్యాలయాలు 13, 14 తేదీల్లో పని సమయాల్లో మార్పులు చేసుకోవాలి, అని సూచించారు.
ఆగస్టు 13, 14 తేదీలకు వాతావరణ శాఖ అలర్ట్
ఆగస్టు 13న తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడనున్నాయని IMD పేర్కొంది.వాటిలో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్, తదితర జిల్లాలున్నాయి. అదే రోజు హైదరాబాద్‌లోనూ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.ఆగస్టు 14న మరింత ఎక్కువ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.ఇవి నిర్మల్, నిజామాబాద్, నల్గొండ, మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలుగా పేర్కొనబడ్డాయి.
ఇప్పటికే వానలు – నగర వాసులకు హెచ్చరికలు
ఇప్పటికే హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి.శనివారం రాత్రి కురిసిన వర్షం వల్ల అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆదివారం కూడా వర్షాలు కొనసాగినట్టు అధికారులు తెలిపారు.ఈ నేపథ్యంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఓ హెచ్చరిక జారీ చేశారు. అనవసరంగా బయటకు రావద్దు. ఇళ్లలోనే ఉండండి, అని సూచించారు.
ఒక గంటలో 10సెం.మీ వర్షం కురుస్తోంది
వర్షాల తీవ్రత అంతాస్థాయిలో ఉందని అర్వింద్ కుమార్ వివరించారు.గంటకు 10 సెం.మీ.కు పైగా వర్షపాతం నమోదు అవుతోంది. లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి విషమంగా మారుతోంది, అని చెప్పారు.ఈ ఏడాది వర్షాలు సాధారణ స్థాయిలో ఉన్నప్పటికీ, ఎనిమిది జిల్లాల్లో ఎక్కువ వర్షపాతం నమోదయ్యిందని చెప్పారు.అదే సమయంలో ఏడు జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు నమోదయ్యాయని తెలిపారు. హైదరాబాద్‌లో మాత్రం వర్షం ప్రభావం ఎక్కువగానే ఉందని స్పష్టంచేశారు.అధికారుల సూచన మేరకు ప్రజలు భద్రతపై శ్రద్ధ చూపాలి. లోతట్టు ప్రాంతాల వారు ముందుగానే ఎచ్చరికగా ఉండాలి.జలమయ ప్రాంతాల్లో ప్రయాణం చేయకుండా, ఇంటి వద్దే సురక్షితంగా ఉండడం ఉత్తమం.
Read Also : Pulivendula ZPTC Election : పులివెందులలోని పోలింగ్ కేంద్రాలన్నీ సమస్యాత్మకమే – కడప ఎస్పీ