ఈ మధ్య వర్షాలు దేశవ్యాప్తంగా విస్తృతంగా కురుస్తుండటంతో పలు ప్రాంతాల్లో వరదలు, జలప్రళయ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో భారీ వర్షాల (Rain Alert) తో నదులు పొంగిపొర్లుతున్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో కూడా రానున్న 24 గంటల్లో వర్షపాతం మరింత పెరిగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. 5 రాష్ట్రాల్లో వానలు వరదల ప్రభావం ఎక్కువగా ఉంది. ఈ నెల 20 వరకు పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

ఉపరితల ఆవర్తనాల ప్రభావం
ప్రస్తుతం దక్షిణ మధ్య మహారాష్ట్ర పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. తెలంగాణ మీదుగా ఉత్తరాంధ్ర తీరం వరకు కొనసాగిన ద్రోణి బలహీనపడింది. అదేవిధంగా ఉత్తరాంధ్రను ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఏపీలో వర్ష సూచన ఉన్న జిల్లాలు
ఈ ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో రానున్న 24 గంటల్లో ఏపీలోని పలు చోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాంధ్రకు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. బంగ్లాదేశ్ నుంచి ఉత్తర బంగాళాఖాతం మీదుగా దక్షిణ ఒడిశా వరకు, మరఠ్వాడ నుంచి తెలంగాణ మీదుగా కోస్తాంధ్ర వరకు వేర్వేరు ఉపరితల ద్రోణులు విస్తరించాయి. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం.
కోస్తా ప్రాంతంలో మత్స్యకారులకు హెచ్చరికలు
బంగాళాఖాతంలో గాలుల ఉధృతం పెరుగుతుండటంతో తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నందున మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించారు.
తెలంగాణలో వాతావరణ పరిస్థితి
తెలంగాణలో ఇప్పటికే కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు(సోమవారం) తెలంగాణలోని అన్ని జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉంది. అలాగే ఈ రోజు తెలంగాణలోని నల్లగొండలో గరిష్టంగా 38.5, మహబూబ్‌నగర్‌లో కనిష్టంగా 28 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.
Read also: Tomato Farmer: ‘ఊజీ ఈగ’ తెచ్చిన తిప్పలు.. రైతులకు భారీ నష్టం