పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ(Goutham Adani)పై అమెరికా దర్యాప్తు కారణంగా డొనాల్డ్ ట్రంప్(Donald Trump) నుంచి పదే పదే బెదిరింపులు వచ్చినప్పటికీ ప్రధాని మోదీ ఎదుర్కోలేకపోతున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. భారత్ తమకు మంచి వాణిజ్య భాగస్వామి కాదని, రాబోయే 24 గంటల్లో సుంకాలను చాలా గణనీయంగా పెంచుతానని ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో రాహుల్ స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
మోదీ చేతులు కట్టేశారు: రాహుల్ గాంధీ
“భారత్ ప్రజలారా, దయచేసి అర్థం చేసుకోండి. అధ్యక్షుడు ట్రంప్ పదే పదే బెదిరింపులు చేసినప్పటికీ ప్రధాని మోదీ మౌనంగా ఉండడానికి కారణం అదానీపై కొనసాగుతున్న అమెరికా దర్యాప్తు. మోదీ, అంబానీ- అదానీ, రష్యన్ చమురు ఒప్పందాల మధ్య ఆర్థిక సంబంధాలను బహిర్గతమవుతాయి. మోదీ చేతులు కట్టేశారు” అని రాహుల్ గాంధీ ఆరోపించారు. అయితే రాహుల్ పోస్ట్‌పై ప్రభుత్వం లేదా అదానీ గ్రూప్ నుంచి స్పందన రాలేదు.

అయితే రష్యాతో భారత్ వ్యాపార సంబంధాలు కొనసాగిస్తుండడాన్ని ఓర్వలేని ట్రంప్ రకరకాల చర్యలకు పాల్పడుతున్నారు. కొద్ది రోజుల క్రితం 25 శాతం సుంకాలతో పాటు పెనాల్టీలు విధిస్తున్నట్లు ప్రకటించారు. భారీ మొత్తంలో రష్యన్ చమురును కొనుగోలు చేసి పెద్ద లాభాలకు అమ్ముతోందని ఆరోపించారు. ఆ తర్వాత ఇటీవల భారత్ మంచి భాగస్వామి కాదని అన్నారు. టారిఫ్‌లను గణనీయంగా పెంచుతానని మరోసారి హెచ్చరికలు చేశారు.
100 శాతం సుంకాలు: ట్రంప్
రష్యా నుంచి అమెరికా కూడా దిగుమతులు చేసుకుంటున్న విషయాన్ని ఇటీవల గుర్తు చేసింది. రసాయనాలు, ఎరువులు వంటివి కొనుగోలు చేస్తోందని తెలిపిన భారత్, అలాంటప్పుడు తమను లక్ష్యంగా చేసుకోవడం అసంబద్ధం అని క్లారిటీ ఇచ్చింది. అయితే అమెరికా వాణిజ్యం చేస్తోందంటూ భారత్‌చేసిన వాదనపై విలేకరులు ట్రంప్‌ను ప్రశ్నించారు. మాస్కో నుంచి వాషింగ్టన్ యురేనియం, ఎరువులు దిగుమతి చేసుకుంటోందా? అని అడిగారు. దీంతో ఆ విషయం గురించి నాకు తెలియదని, తెలుసుకోవాలని ట్రంప్ అన్నారు. అయితే, దీనిపై త్వరలోనే మీకు సమాధానమిస్తామని పేర్కొన్నారు. మాస్కోతో చమురు వాణిజ్యం చేస్తే భారత్ సహా ఆయా దేశాలపై 100 శాతం సుంకాలు విధిస్తానని హెచ్చరించిన ట్రంప్, ఇప్పుడు మాట మార్చారు .
రాహుల్ గాంధీ ఎవరు?
రాహుల్ గాంధీ (జననం 19 జూన్ 1970) రాజకీయ నాయకుడు మరియు కాంగ్రెస్ పార్టీ సభ్యుడు. ఆయన ముత్తాత భారతదేశపు మొదటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ. ఆయన అమ్మమ్మ భారతదేశపు మొదటి మహిళా ప్రధానమంత్రి ఇందిరా గాంధీ. ఆయన తండ్రి రాజీవ్ గాంధీ భారతదేశపు అతి పిన్న వయస్కుడైన ప్రధానమంత్రి.
రాహుల్ గాంధీ ఎవరి కుమారుడు?
రాహుల్ గాంధీ (జననం 1970), రాజీవ్ గాంధీ మరియు సోనియా గాంధీల కుమారుడు. ఆయన 2017 మరియు 2019 వరకు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారు మరియు 2004 నుండి 2019 వరకు యుపిలోని అమేథి నుండి పార్లమెంటు సభ్యుడిగా ఉన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: