రాత్రి రైల్లో తమిళనాడుకు బయల్దేరనున్న కాంగ్రెస్ అగ్రనేత
హైదరాబాద్: కాంగ్రెస్ జాతీయ నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేడు తెలంగాణకు రానున్నారు. సాయంత్రం 5.30 గంటలకు శంషాబాద్ చేరుకోనున్న రాహుల్.. చాపర్‌లో వరంగల్ చేరుకోనున్న రాహుల్.. వరంగల్ సుప్రభా హోటల్‌లో కాసేపు విశ్రాంతి తీసుకోనున్నారు. 7:30కి వరంగల్ నుంచి రైలులో చెన్నై వెళ్లనున్నారు. చెన్నై వెళ్తున్న విద్యార్థులతో కలిసి ఆయన ప్రయాణం చేస్తారు. ఈ సందర్భంగా రైల్లోనే విద్యార్థులతో అయన ముఖాముఖి నిర్వహిస్తారు.

కాగా, బీసీ కుల గణన అంశంలో ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోందని ప్రభుత్వం చెబుతోంది. బీసీ కుల గణన, ఎస్సీ వర్గీకరణ అంశంపై ప్రజల స్పందనను రాహుల్ తెలుసుకొనున్నారు. రైల్వే ప్రైవేటీకరణ అంశంపై రైలు ప్రయాణికుల నుంచి అభిప్రాయాలను సేకరించనున్నారు.
అయితే, ముందుగా హైదరాబాద్ నుంచి వరంగల్‌కు రాహుల్ గాంధీ వెళ్లనున్నారు. అనంతరం ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొననున్న రాహుల్.. తిరిగి రాత్రి 7.30 గంటలకు మరల చెన్నైకు వెళ్లనున్నట్లు సమాచారం. కాగా, రాహుల్ గాంధీ వెంట సీఎం రేవంత్ సైతం వరంగల్ వెళ్తారా? లేదా అనేది ఇంకా తెలియరాలేదు. కాగా, అటు వరంగల్‌లోనూ రాహుల్‌కు స్వాగతం పలికేందుకు ఉమ్మడి జిల్లా మంత్రులు భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.