Rahul Gandhi Warangal visit cancelled

రాహుల్ గాంధీ వరంగల్ పర్యటన రద్దు

పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో రాహుల్ పర్యటన రద్దు

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ వరంగల్‌ పర్యటన రద్దయింది. నేటి సాయంత్రం ఆయన హైదరాబాద్‌ వచ్చి.. ఆ తర్వాత వరంగల్‌ వెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు తొలుత తెలిపాయి. వరంగల్‌లో కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలతో ఆయన సమావేశం కానున్నట్లు వెల్లడించాయి. అయితే పార్లమెంట్‌ సమావేశాల కారణంగా రాహుల్‌గాంధీ తన పర్యటనను తాజాగా రద్దు చేసుకున్నట్లు సమాచారం.

image

కాగా, షెడ్యూల్‌ ప్రకారం ఇవాళ సాయంత్రం 5.30 గంటలకు రాహుల్‌ శంషాబాద్ చేరుకుని అక్కడ నుంచి చాపర్‌లో వరంగల్ చేరుకోవాల్సి ఉంది. వరంగల్ సుప్రభా హోటల్‌లో కాసేపు విశ్రాంతి తీసుకుని 7:30కి వరంగల్ నుంచి రైలులో చెన్నై వెళ్లాల్సి ఉంది.

బీసీ కుల గణన అంశంలో ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోందని ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో.. బీసీ కుల గణన, ఎస్సీ వర్గీకరణ అంశంపై ప్రజల స్పందనను రాహుల్‌ తెలుసుకోవడంతో పాటు, రైల్వే ప్రైవేటీకరణ అంశంపై రైలు ప్రయాణికుల నుంచి అభిప్రాయాలను సేకరించాల్సి ఉంది.. అయితే, భద్రతపరమైన ఇబ్బందులు కారణంగా చివరి క్షణంలో పర్యటన రద్దు అయ్యింది.

Related Posts
భారత్-చైనా ఒప్పందం: కైలాష్ మానససరోవర్ యాత్ర పునఃప్రారంభం
భారత్-చైనా ఒప్పందం: కైలాష్ మానససరోవర్ యాత్ర పునఃప్రారంభం

2020 నుండి కైలాష్ మానస సరోవర్ యాత్రను నిలిపివేశారు. దీనికి కారణం మహమ్మారి COVID-19. ఇపుడు కరోనా వైరస్ తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వం చైనాతో ఒప్పందం కుదుర్చుకొని Read more

నేడు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు శంకుస్థాపన చేయనున్న సీఎం
cm revanth reddy to lay fou

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ తీసుకురానుంది. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్‌కు సీఎం Read more

ఆరోగ్యకరమైన మిరప పువ్వులు, సంతోషకరమైన రైతులకు భరోసా అందిస్తున్న గోద్రెజ్ రాషిన్‌బాన్
Godrej Rashinban ensures healthy chilli flowers and happy farmers

హైదరాబాద్‌: మిరప మొక్కలో కీలకమైన ఆర్థిక భాగమైనందున, మిరప సాగులో పువ్వులు విజయానికి అత్యంత కీలకం. ఈ కీలకమైన వాస్తవాన్ని గుర్తించి, ఈ కీలకమైన మొక్కల నిర్మాణాలను Read more

ఎలాన్ మస్క్ మళ్ళీ రికార్డు: నెట్ వర్థ్ $300 బిలియన్ ని దాటింది
elon

ప్రపంచంలో అతి ధనవంతులైన వ్యక్తుల జాబితాలో ఎలాన్ మస్క్‌ను ఎప్పటికప్పుడు చూస్తాం. తాజాగా, ఎలాన్ మస్క్‌ ఆర్థికంగా మరింత ఎదుగుదలను సాధించారు. ఆయన నెట్ వర్థ్‌ $300 Read more