అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు భారత్‌లో రాజకీయ దుమారం రేపుతున్నాయి. భారతదేశం మరియు రష్యా (India and Russia) ఆర్థిక వ్యవస్థలు పతనమవుతున్నాయని ట్రంప్ వ్యాఖ్యానించగా, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆయన మాటలకు మద్దతు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.

రాహుల్ గాంధీ సమర్థన.. అధికార పార్టీ విమర్శ
ట్రంప్ (Trump) వ్యాఖ్యలను సమర్థిస్తూ రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన ట్వీట్ ఆయన ప్రకటనతో భారత్ ఆర్థిక వ్యవస్థపై అంతర్జాతీయంగా తప్పుడు సందేశం వెళ్తుందంటూ అధికార పక్షం తీవ్రంగా విరుచుకుపడింది. భారత ప్రజల సంక్షేమానికి మద్దతుగా నిలబడాల్సిన నేత అయిన రాహుల్, విదేశీ నాయకుడి విమర్శలకే జేజేలు పలకడం సరైన పద్ధతా అనే ప్రశ్నలు రావటం మొదలయ్యాయి. ఇప్పుడు సొంత పార్టీ నేతల నుంచి ఆయన విమర్శలు ఎదుర్కొంటున్నారు.
కాంగ్రెస్ నేతల అసంతృప్తి: శశి థరూర్ స్పందన
రాహుల్ గాంధీ సమర్థించడాన్ని సొంత పార్టీకి చెందిన ఎంపీ శశిథరూర్ తప్పుబట్టారు. రాహుల్ వ్యాఖ్యలతో తాను విభేదిస్తున్నానని ఆయన స్పష్టం చేశారు. ట్రంప్‌ను రాహుల్ గాంధీ సమర్థించడంపై పార్లమెంటు వెలుపల మీడియా ప్రశ్నించగా, థరూర్ కొట్టిపారేశారు. భారత ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందో అందరికీ తెలుసని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో ఎంపీ కార్తి చిదంబరం కూడా రాహుల్ గాంధీ వ్యాఖ్యలతో విభేదించారు. ట్రంప్ సంప్రదాయేతర రాజకీయ నాయకుడంటూ చురకలు అంటించారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: