हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Rahul Gandhi: మనసున్న రాహుల్ గాంధీ.. 22 మంది చిన్నారుల బాధ్యత స్వీకారం

Sharanya
Rahul Gandhi: మనసున్న రాహుల్ గాంధీ.. 22 మంది చిన్నారుల బాధ్యత స్వీకారం

జమ్ము కశ్మీర్‌లో ఇటీవల జరిగిన ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) సమయంలో పూంఛ్ జిల్లా పలు గ్రామాలు తీవ్ర ఉద్రిక్తతలకు లోనయ్యాయి. పాక్ ప్రేరిత ఉగ్రదాడుల కారణంగా అనేక కుటుంబాలు బలయ్యాయి. ఈ ఘటనలతో తల్లిదండ్రులను కోల్పోయిన 22 మంది చిన్నారులు అనాథలుగా మిగిలిపోయారు. బాధను తట్టుకోలేని పరిస్థితిలో ఉన్న ఈ చిన్నారులకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) అండగా నిలిచారు.

ప్రత్యక్ష పర్యటనలో చిన్నారుల కష్టాలు తెలుసుకున్న రాహుల్

రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఇటీవల జమ్ము కశ్మీర్‌లోని సరిహద్దు గ్రామాలకు ప్రత్యేక పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా పూంఛ్ (Poonch) ప్రాంతంలో స్థానిక ప్రజలతో మమేకమయ్యారు. ఈ క్రమంలో అనాథలైన చిన్నారుల పరిస్థితిని తెలుసుకున్న రాహుల్, వెంటనే పార్టీ శ్రేణులకు ఆ జాబితాను సిద్ధం చేయాలని సూచించారు. రాహుల్ గాంధీ అభ్యర్థన మేరకు, జమ్ము కశ్మీర్ కాంగ్రెస్ చీఫ్ వీరుల జాబితాను సిద్ధం చేశారు. మొత్తం 22 మంది చిన్నారులు ఈ జాబితాలో ఉన్నారు. వారందరికీ విద్య, వైద్యం, జీవనోపాధి ఖర్చులు తదితర అవసరాలను రాహుల్ గాంధీ వ్యక్తిగతంగా భరించనున్నట్టు వెల్లడించారు.

గ్రాడ్యుయేషన్ వరకు ఉచిత విద్య, వైద్యం

ఈ చిన్నారులకు డిగ్రీ చదువు పూర్తయ్యే వరకు అన్ని అవసరాలకూ ఆర్థిక సహాయం అందించనున్నట్లు సమాచారం. దీంతో పాటు వైద్య సహాయం, వస్త్రధారణ, జీవనోపాధికి అవసరమైన ఇతర విషయాల్లోనూ రాహుల్ వారి కుటుంబంలా అండగా భరిస్తారని హమీద్ వివరించారు. త్వరలోనే ఈ చిన్నారులకు తొలి విడత సాయం అందజేస్తామని చెప్పారు.

Read hindi news: hindi.vaartha.com

Read also: Nimisha Priya: నిమిష ఉరిశిక్ష రద్దుపై కేంద్రం ఏమన్నదంటే..

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870