టెన్నిస్ క్రీడాకారిణి రాధికా యాదవ్ హత్య దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. తనే తన కూతురిని కాల్చిచంపినట్లు ఆమె తండ్రి ఒప్పుకోగా, ఈ కేసు వెనుక గల కారణాలపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఇదిలా ఉండగా, ఇటీవల రాధికాతో కలిసి మ్యూజిక్ వీడియోలో నటించిన కో-స్టార్ ఇనాముల్ హక్ ఈ ఘటనపై స్పందిస్తూ తనకు ఆ హత్యతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశాడు.ఢిల్లీలో జరిగిన టెన్నిస్ ప్రీమియర్ లీగ్ (Tennis Premier League) సమయంలో రాధికతో పరిచయడం ఏర్పడిందని, ఆ తర్వాత ఇద్దరం కలిసి మ్యూజిక్ వీడియో చేశామని, ఆ తర్వాత ఇద్దరు వేరు అయ్యామని ఇనాముల్ హక్ తెలిపాడు. మ్యూజిక్ వీడియో షూటింగ్ కోసం తన తల్లితో కలిసి రాధిక వచ్చిందని, ఆమెకు పేమెంట్ కూడా ఇచ్చామని, ఆ తర్వాత ఇద్దరం ఎప్పుడూ కలుసుకోలేదని ఇనాముల్ చెప్పాడు. రాధికా యాదవ్‌తో పర్సనల్ రిలేషన్ ఉందని వస్తున్న వదంతులను అతను కొట్టిపారేశాడు.
ఆందోళన
ఆ రూమర్స్‌లో నిజం లేదని, అవన్నీ అవాస్తవాలన్నాడు. మా మధ్య స్నేహం కానీ, రిలేషన్ కానీ లేదన్నాడు. ఓ వీడియో ప్రాజెక్టు కోసం ఆమె కేవలం తనతో నటించినట్లు చెప్పాడు.రాధికా యాదవ్ మృతికి, మతపరమైన కోణాన్ని జోడించడం పట్ల అతను ఆందోళన వ్యక్తం చేశాడు. దీన్ని హిందూ-ముస్లిం గొడవగా ఎందుకు చిత్రీకరిస్తున్నారో అర్థం కావడం లేదన్నాడు. దీంట్లో తన పాత్రేమీ లేదన్నాడు. మ్యూజిక్ వీడియో సాంగ్‌ను తండ్రి మెచ్చుకున్నట్లు రాధిక తనతో సెట్స్‌లో చెప్పిందని ఇనాముల్ గుర్తు చేశాడు. అంటే ఆ సాంగ్‌కు ఫ్యామిలీ సపోర్టు ఉందని అర్థమైందన్నాడు. కానీ రాధిక (Radhika Yadav) తన ఇన్‌స్టా అకౌంట్‌ను కొన్నిసార్లు డీయాక్టివ్, రీయాక్టివ్ చేసిందన్నాడు. ఈ కేసులో తనను పోలీసులు ఇంకా ప్రశ్నించలేదన్నాడు. ఒకవేళ పోలీసులు దర్యాప్తుకు రమ్మంటే వెళ్తానని చెప్పాడు.

నాలుగు బుల్లెట్లు
వీడియోకు మంచి గుర్తింపు రాలేదని, అందుకే దాన్ని తొలగించాలనుకున్నాని, మరో టీమ్‌తో ఆ సాంగ్‌ను రీ రిలీజ్ చేయాలనుకున్నట్లు అతను చెప్పాడు.గురుగ్రామ్ సెక్టార్ 57లో ఉన్న ఇంట్లో, రాధికను తండ్రి దీపక్ యాదవ్ (Deepak Yadav) కాల్చి చంపాడు.శుక్రవారం ఆమెకు అంత్యక్రియలు నిర్వహించారు. పలుచోట్ల రాధికకు తుపాకీ తూటాలు దిగినట్లు డాక్టర్లు చెప్పారు. అటాప్సీ టైం (Autopsy time) లో నాలుగు బుల్లెట్లు తీసినట్లు డాక్టర్లు తెలిపారు. టెన్నిస్ అకాడమీ నడిపిస్తున్న కూతురు రాధికతో తండ్రికి విబేధాలు తలెత్తినట్లు పోలీసు ప్రతినిధి సందీప్ కుమార్ తెలిపారు. కానీ సోషల్ మీడియాలో ఉన్న మ్యూజిక్ వీడియోను తొలగించాలని రాధికపై తండ్రి ఒత్తిడి తీసుకువచ్చినట్లు కొన్ని దర్యాప్తు కోణాల్లో తెలుస్తోంది.
హత్యకు కారణం ఏమిటి?
టెన్నిస్ అకాడమీ స్థాపించి, నడుపుతుంది. అయితే అందరూ కూతురు సంపాదనపై బతుకుతున్నావని ఆమె తండ్రి దీపక్‌ను ఎగతాళి చేయడం ప్రారంభించారు. దాంతో కూతరును టెన్నిస్ అకాడమీని మూసేయమని పలుమార్లు చెప్పాడు. అయినా ఆమె వినిపించుకోక పోవడంతో గురువారం మరోమారు ఈ విషయమై తండ్రీకూతుళ్ల మధ్య వాగ్వాదం జరిగింది. కూతురిపై కోపం తెచ్చుకున్న దీపక్.. తన లైసెన్స్‌డ్ రివాల్వర్ తీసుకువచ్చి 4 రౌండ్లు కాల్పులు జరిపాడు.
రాధికా యాదవ్ వయస్సు ఎంత?
రాధికా యాదవ్ వయస్సు 25.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Jasprit Bumrah: సంబరాలకు దూరంగా ఉంటానన్న బుమ్రా..