తెలంగాణలో సంచలనం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో విచారణ మరింత వేగవంతమవుతోంది. తవ్వుతున్నకొద్దీ బాధితుల పేర్లు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో కీలకంగా భావిస్తున్న ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణకు ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) నోటీసులు జారీ చేసింది. ఆయన ఫోన్ ట్యాప్ చేసినట్లు ఆధారాలు లభించాయని అధికారులు అనుమానిస్తున్నారు. అందుకే ఈ రోజు ఉదయం 11 గంటలకు ఆయన విచారణకు హాజరుకానున్నారు.
బీజేపీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి విచారణకు హాజరు
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక నాయకుడు బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి. ఆయన ఫోన్ కూడా ట్యాప్ చేసినట్లు సిట్ గుర్తించినట్టు తెలుస్తోంది. దీనిపై స్పష్టతకోసం ఆయనను కూడా ఈ రోజు విచారణకు పిలవడం జరిగింది. టెలిఫోనిక్ సంభాషణలు రాజకీయ లబ్దికి వాడినట్లుగా ఆరోపణలు వస్తుండటంతో, ఈ కేసులో ప్రతిపక్ష నేతలతోపాటు మీడియా ప్రతినిధుల పేర్లు కూడా విచారణకు నెట్టెస్తున్నాయి.
మరిన్ని రాజకీయ పేర్లు వెలుగులోకి రావచ్చా?
ఇటీవల మంత్రి వివేక్ కూడా తన ఫోన్ ట్యాప్ చేశారని ఆరోపణలు చేశారు. దీనితో ఈ వ్యవహారంలో రాజకీయ ప్రేరణలపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. SIT దర్యాప్తు మరింత లోతుగా సాగుతున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో మరిన్ని రాజకీయ ప్రముఖులు, పాత్రికేయుల పేర్లు బయటపడే అవకాశం ఉంది. ఈ కేసు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపే సూచనలు కనిపిస్తున్నాయి.
Read Also : Dwacra : డ్వాక్రా మహిళలకు తెలంగాణ సర్కార్ తీపి కబురు?