krishnaiah

తెలుగు సీఎంలు చొరవ తీసుకోవాలి: ఆర్ కృష్ణయ్య

పార్లమెంటులో బీసీ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించేందుకు ఏపీ, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి చొరవ తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీల డిమాండ్‌లపై హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ దేశోద్ధారక భవన్‌లో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ..
బీసీలకు విద్య, ఉద్యోగ, ఆర్థికాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు కేంద్రంలో బీసీ ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు బీసీల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి సహకరించాలని కోరారు.
బీసీల మహాసభ
బీసీల డిమాండ్ల సాధనకు జనవరి చివరి వారంలో ఆర్ కృష్ణయ్య అధ్యక్షతన అమరావతి వేదికగా బీసీల మహాసభ నిర్వహించనున్నట్లు ఏపీ బీసీ సంక్షేమ సంఘం ఇన్‌ఛార్జి నూకానమ్మ తెలిపారు. ఈ సమావేశంలో ఏపీ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు నాగేశ్వరరావు యాదవ్, రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు వెంకట కోటేశ్వరరావు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం కన్వీనర్ గుజ్జ కృష్ణ తదితర నేతలు పాల్గొన్నారు.

Advertisements
Related Posts
సంక్రాంతి సందర్బంగా ఏపీ వైపు ఎన్ని వాహనాలు వెళ్లాయంటే..?
How many vehicles went towa

సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలు పెద్ద ఎత్తున హైదరాబాద్ నుండి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లారు. పండుగ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి గడపాలని చాలామంది పుట్టిన ఊళ్లకు బయలుదేరుతున్నారు. Read more

Bhubharathi : పైలెట్ ప్రాజెక్టుగా నేలకొండపల్లి ఎంపిక
bhubharathi nelakondapalli

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రతిష్టాత్మక భూభారతి పోర్టల్‌ను అమలు చేసేందుకు తొలి అడుగులు వేసింది. భూముల సమాచారాన్ని సమగ్రంగా నమోదు చేయడం, రిజిస్ట్రేషన్లు సాంకేతికంగా నిర్వహించడం Read more

కాళోజీ సేవలను స్మరించుకున్న కేసీఆర్‌
KCR pays tribute to Kaloji Narayana Rao his death anniversary

హైదరాబాద్‌ : నేడు కాళోజీ వర్ధంతి. ఈ సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్‌ ఆయన సేవలను స్మరించుకున్నారు. తెలంగాణ అస్తిత్వం, సాహిత్య గరిమను ప్రపంచానికి చాటారని అన్నారు. Read more

మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు
sithakka

తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. సియోల్ పర్యటన నుంచి వచ్చిన వెంటనే తెలంగాణలో పొలిటికల్ బాంబులు పేలబోతున్నాయని, Read more

×