pv sindhu wedding

ఉదయ్‌పూర్‌లో నేడు అట్టహాసంగా పీవీ సింధు వివాహం

భారత ప్రఖ్యాత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు వివాహ వేడుక రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో అట్టహాసంగా ప్రారంభమైంది. హైదరాబాద్‌కు చెందిన పోసిడెక్స్ టెక్నాలజీస్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట దత్త సాయితో ఆమె వివాహం ఈరోజు ఉదయ్‌పూర్‌లోని రఫల్స్ స్టార్ హోటల్లో జరగబోతోంది. సింధు, దత్త సాయి కుటుంబ సభ్యులు రెండు రోజుల క్రితం నుంచే వేడుకల కోసం ఉదయ్‌పూర్‌ చేరుకున్నారు.

ఈ వివాహ మహోత్సవానికి 140 మంది అతిథులు మాత్రమే ఆహ్వానితులుగా ఉన్నారు. వీరి కోసం హోటల్లో వంద గదులు ప్రత్యేకంగా బుక్ చేశారు. శనివారం మెహిందీ, సంగీత్ కార్యక్రమాలు జరగగా, ఈ సందర్భంగా వధూవరులు ప్రత్యేక ఫోటోషూట్ కూడా నిర్వహించారు. వేడుకలో స్నేహితులు, కుటుంబ సభ్యులు సందడిగా పాల్గొన్నారు. రాజస్థాన్ ప్రత్యేకతలు ప్రతిఫలించేలా వివాహానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. వివాహ వేడుక దక్షిణ భారత సంప్రదాయాల ప్రకారం జరుగుతుండగా, రాజస్థాన్ రాచరిక సొబగులతో అతిథులను స్వాగతం పలికారు. వివాహ భోజనంలో ప్రత్యేక వంటకాలను అందించనున్నారు. ఈ వేడుకకు దేశవ్యాప్తంగా ఉన్న పలువురు క్రీడా, రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది.

పీవీ సింధు తన వివాహ మహోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌తో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వంటి ప్రముఖులకు ఆహ్వానాలు పంపింది. వివాహ అనంతరం మంగళవారం (24న) హైదరాబాద్‌లో రిసెప్షన్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి కూడా పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.

Related Posts
మరో సారి హైదరాబాద్‌లో ఐటీ సోదాలు..
IT searches in Hyderabad again

హైదరాబాద్ : ఐటీ అధికారుల సోదాలు హైదరాబాద్ లో మరో సారి కలకలం రేపుతున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారాలే లక్ష్యంగా మరో సారి ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. Read more

నిరుద్యోగ యువత కోసం స్వయం ఉపాధి పథకం : డిప్యూటీ సీఎం
Self employment scheme for unemployed youth.. Deputy CM

హైదరాబాద్‌: నిరుద్యోగ యువతకి ఉపాధి కోసం రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రభుత్వం ప్రకటించింది. రూ. 6 వేల కోట్లతో రాజీవ్ యువ వికాసం పథకం ప్రారంభించనున్నారు. Read more

ప్రముఖ నటుడు ముస్తాక్ ఖాన్ కిడ్నాప్
Mushtaq Khan kidnap

ప్రముఖ నటుడు ముస్తాక్ ఖాన్ కిడ్నాప్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 'స్త్రీ-2', 'వెల్కమ్' వంటి చిత్రాల్లో తన నటనతో గుర్తింపు పొందిన ఆయనను దుండగులు గతనెల Read more

షర్మిల, విజయమ్మపై పిటిషన్.. స్పందించిన జగన్
New law in AP soon: CM Chandrababu

తన చెల్లి షర్మిల, తల్లి విజయమ్మపై వేసిన పిటిషన్ నేపథ్యంలో టీడీపీ చేస్తున్న విమర్శలపై మాజీ సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేసారు. తన చెల్లి షర్మిల Read more