PV Sindhu Bhoomi Puja for Badminton Academy in Visakha

విశాఖలో బ్యాడ్మింటన్ అకాడమీ నిర్మాణానికి భూమిపూజ చేసిన పీవీ సింధు

విశాఖపట్నం: విశాఖపట్నంలోని పెద గదిలి కూడలి సమీపంలో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన స్థలంలో బ్యాడ్మింటన్ అకాడమీ నిర్మాణానికి ఒలింపిక్ ప‌త‌క విజేత‌, భార‌త స్టార్ బ్యాడ్మింట‌న్ ప్లేయ‌ర్ పీవీ సింధు తన తల్లిదండ్రులతో కలిసి భూమిపూజ చేశారు. ఇక్కడ సుమారు మూడెకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఆమెకు కేటాయించింది.

అనంతరం పీవీ సింధు మాట్లాడుతూ..పనులు త్వరగా చేపట్టి ఏడాదిలోగా నిర్మాణం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అకాడమీ సామర్థ్యం, శిక్షణ తదితర వివరాలను త్వరలో వెల్లడిస్తామన్నారు. బ్యాడ్మింటన్‌పై ఆసక్తి ఉన్న చిన్నారులు, యువతను ఉన్నత స్థాయి పోటీల్లో ప్రతిభ చూపేలా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని పీవీ సింధు అన్నారు. త‌న‌కు ప్ర‌భుత్వం నుంచి పూర్తి స‌హాయ స‌హ‌కారాలు ఉన్నాయ‌ని, అకాడ‌మీ నిర్మాణానికి అన్ని అనుమ‌తులు వ‌చ్చాయ‌ని తెలిపారు. వైజాగ్‌లో బ్యాడ్మింట‌న్ నేర్చుకునే క్రీడాకారుల పొటెన్షియాలిటీ చాలా ఎక్కువ‌ని ప్ర‌శంసించారు. ప్ర‌భుత్వ స‌హకారంతో బ్యాడ్మింట‌న్‌పై ఆస‌క్తి ఉన్న యువ‌తీ, యువ‌కుల‌కు అద్భుత‌మైన శిక్ష‌ణ ఇస్తామ‌ని సింధు తెలిపారు. త‌ద్వారా మెరిక‌ల్లాంటి ఆట‌గాళ్ల‌ను త‌యారు చేసి, అంత‌ర్జాతీయ వేదిక‌ల‌పై మెడ‌ల్స్ గెలిచేలా త‌యారు చేస్తామ‌ని అన్నారు.

Related Posts
హస్తినను హస్తగతం చేసుకునేది ఎవరు?
elections

దేశ రాజధానిలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఆరంభమైంది. ఈ ఉదయం సరిగ్గా 7 గంటల నుంచి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటోన్నారు. ఢిల్లీతో పాటు ఉత్తరప్రదేశ్‌లోని Read more

ఛాంపియన్స్ ట్రోఫీకి ముందే పాకిస్తాన్ భారీ కుట్ర!
ఛాంపియన్స్ ట్రోఫీకి ముందే పాకిస్తాన్ భారీ కుట్ర!

పాకిస్థాన్ సెలక్టర్లు గాయపడిన ఓపెనర్ సైమ్ అయూబ్‌ను 2025 ఛాంపియన్స్ ట్రోఫీ కోసం తాత్కాలిక జట్టులో చేర్చాలని నిర్ణయించారు. ప్రస్తుతం లండన్‌లో పునరావాసం పొందుతున్న సైమ్, తన Read more

వచ్చే ఐదేళ్లలో నాలుగు కుంభమేళాలు
Four Kumbh mel

ఐదేళ్లలో నాలుగు కుంభమేళాలు ఇటీవల ముగిసిన మహా కుంభమేళా మరో 144 ఏళ్లకు మాత్రమే తిరిగి జరుగుతుంది. అయితే వచ్చే ఐదేళ్లలో దేశవ్యాప్తంగా నలుగురు పవిత్ర నగరాల్లో Read more

కార్తీక పౌర్ణమి రోజు 365 వత్తులు ఎందుకు వెలిగిస్తారో తెలుసా..?
karthika pournami 365 vattu

కార్తీక పౌర్ణమి తెలుగు భక్తుల ఆధ్యాత్మిక జీవితంలో ప్రత్యేకమైన స్థానం కలిగి ఉంటుంది. ఈ రోజున 365 వత్తులను వెలిగించడం అత్యంత పవిత్రంగా భావించబడుతుంది. ఎన్నో పండుగలకు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *